Home జిల్లాలు మాంసం తింటే.. మంచానికే!

మాంసం తింటే.. మంచానికే!

Meat-Shopsఅనారోగ్య మేకల వద
కలుషిత మాంసం విక్రయాలు
పశు సంవర్ధక, జిపి అధికారుల నిస్తేజం
ప్రజారోగ్యంపై ప్రభావం
మన తెలంగాణ/బాన్సువాడ టౌన్: విందు జరిగిన, వినోదం జరిగిన, పండగొచ్చిన, పబ్బం వచ్చిన ఆనందంగా గడుపుకోవాలంటే నేటి రోజుల్లో మాంసహారమే ముఖ్యమైపోయింది. అటి చికెన్, మఠన్ అయిన సరే ఏదో ఒకటి ఇంట్లో మాసాలాలతో గుప్పుమంటేనే ఆ ఇంట్లో నూతనోత్తేజం వస్తుంది. అలాంటి ప్రాధాన్యతను సంతరించుకున్న మాంసం విక్రయాలు నిబందనలు గాలికి పోతున్నాయి. ప్రతి వారం ప్రత్యేక దినాలు, పండగ పబ్బాల రోజుల్లో మాంసం వ్యాపారులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాధి భారీన పడ్డ మేకలు, గొర్రెలను వదిస్తున్నారు. అట్టి మాంసాన్ని మార్కెట్‌లో పెట్టి విక్రయిస్తున్నారు. దీంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. మాంసం తిందామంటే మరుసటి రోజు మంచం ఎక్కే పరిస్థితి ఏర్పడుతుంది. మాంసం కలుషితం కారణంగా అధి భుజించడం వల్ల వాంతులు, విరోచనాలే కాకుండా ఇతర్ర రోగాల భారీన పడాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆరోగ్యంగా ఉండే మేకలను మాత్రమే వధించి వాటి మాంసాన్ని మార్కెట్‌లో పెట్టి అమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తుండడంతో మాంసం విక్రయదారులు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే కలుషిత అమ్మకాలు సాగిస్తున్నారు. వ్యాధి భారీన పడ్డ మేకలు, గొర్రెల మాంసంపై ఎన్నో విషపూరితమైన క్రిమికీటకాలు చేరుకుంటాయి. వాటి ప్రభావంతో మేకల శరీరం పూర్తిగా విషపూరితమవుతుంది. అలాంటి వాటి మాంసాన్ని విక్రయించడానికి వీలుండదు. అయినప్పటికి చనిపోయిన మేకలు, మరో గంటకు మౄతి చెందే గొర్రెలను సైతం అతి తక్కువ ధరలకు కొనుగోలుచేస్తూ గుట్టుగా వాటిని వధించి మార్కెట్‌లో పెట్టి అమ్ముతున్నారు. వెయ్యి నుంచి 1500 రూపాయల వరకు అనారోగ్య మేకను కొని అట్టి మేకను వదించి కిలోకు 400 చొప్పున 4 వేలు సంపాదించుకుంటున్నారు. అలాగే చికెన్ మాంసంలో కూడా కలుషితం చోటు చేసుకుంటుంది. రోగాల భారీన పడ్డ కోళ్లను తీసుకొచ్చి కోస్తూ వాటి మాంసాన్ని చికెన్ సెంటర్‌లలో అమ్ముతున్నారు. డైరీ ఫారం మాంసం చికెన్ మాంసం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.మౄతి చెందిన కోళ్లను తినరాదని తెలిసినప్పటికి చికెన్ సెంటర్ యజమానులు అమ్మే మాంసాన్ని తిని మంచాన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు.

తక్కువ ధరకు కొనుగోళ్లు..
వ్యాధి భారీన పడ్డ మేకలు, గొర్రెలను వెయ్యి నుంచి 1500 కొనుగోలు చేస్తూ అట్టి మాంసాన్ని కిలోకు 400 రూపాయల చొప్పున మాంసం విక్రయ శాలలో వ్యాపారులు అమ్ముకుంటున్నారు. వాస్తవానికి ఆరోగ్యమైనమేక కొనాలంటే సుమారు పది కిలోల బరువు కలిగి ఉంటే 5 నంచి 6 వేల వరకు ధర పలుకుతుంది. కానీ మేకల పెంపకం దారుడు మేక ఆరోగ్యాన్ని బట్టీ వౄదాగా పడేయలేక మాంసం విక్రయదారులకు సమాచారం అందిస్తుంటారు. గుట్టుగా పెంపకం శాలకు వెళ్లి రహస్యంగా వాటిని కొనుగోలు చేస్తూ రాత్రి వేళల్లో మేకలు, గొర్రెలను తరలిస్తుంటారు. అర్ధరాత్రి సమయంలో వాటిని వధిస్తూ తెల్లవారు జామునే మాంసం విక్రయశాల్లో ఏర్పాటు చేస్తారు. అది ప్రెష్‌మాంసంగా నమ్మి వినియోగదారులు ఉత్సాహంగా కొనుగోలు చేసి నిరుత్సాహంగా అనారోగ్యంగా మారి మంచాన పడుతున్నారు.

జిపి, పశు సంవదర్శక శాఖల నిర్లక్ష్యం
ప్రతి మాంసం విక్రయశాలలో అమ్మే మేకలను ముందుగా నిబందనల ప్రకారం గ్రామ పంచాయతీ ఆరోగ్యంగగా ఉన్నట్లు నిర్ధారించాలి. ఆ నిర్ధారణ జరగాలంటే పశు సంవదర్శక శాఖ అధికారులు మేక ఆరోగ్య స్థితి గతులపై పరీక్షలు చేయాలి.వంద శాతం ఆరోగ్యంగా ఉందని రుడి చేస్తేనే గ్రామ పంచాయతీ అధికారులు ఆ మేకను వదించేందుకు అనుమతి కల్పిస్తూ మేక మాంసంపై స్టాంపు వేస్తారు.ఆ స్టాంపు ఉన్న మేక మాంసాన్ని మాత్రమే వ్యాపారులు అమ్మాలి. అట్టి ముద్రను చూసి వినియోగదారులు మాంసం కొనాలి. మేకకు 10 నుంచి 20 రూపాయల చొప్పున వ్యాపారులు జీపికి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అలా ఎన్ని మేకలను వదించిన వాటన్నింటిని పరీక్షలు నిర్వహించాల్సిందే. వాటికి సంబంధించి జీపికి సుంకం కట్టాల్సిందే . కాని ఇపుపడు ఎక్కడ కూడా అలాంటి నిబందనలు అమలు కావడం లేదు. జీపి అధికారులు, పశు సంవర్ధక శఖ అధికారులుప ర్యవేక్షించాల్సిన దాఖలాలు లేవు. అర్ధరాత్రి వేళల్లో వద చేయడం తెల్లవారు జామున అమ్ముకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇలాంటి కలుషిత మాంసం విక్రయ బాగోతానికి కల్లెం వేస్తే తప్ప ప్రజారోగ్యం అదుపులో ఉంటుందని పలువురు మాంసం కొనుగోలు దారులు కోరుతున్నారు.