Home తాజా వార్తలు మంత్రి పోచారం శ్రీనివాస్‌కు అస్వస్థత

మంత్రి పోచారం శ్రీనివాస్‌కు అస్వస్థత

POCHARAM

న్యూఢిల్లీ: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసియులో చికిత్స అందిస్తున్నారు. బిపి తగ్గడమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. మంత్రి పోచారంను స్పీకర్ మధుసూదనాచారి, పలువురు మంత్రులు పరామర్శించారు. రాజ్యసభకు ఎన్నికైన ఎంపీలు జోగినపల్లి సంతోష్, లింగయ్య యాదవ్, బండా ప్రకాష్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.