Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సచిన్ ట్వీట్ చూసి షాకయ్యా…

Rashid,Rashid Khan says I am proud Afghan and I will stay in my Country

ఐపిఎల్-11లో అద్భుత ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో ఎంతో గొప్ప ఆటగాడని, ఆయన తనను పొగుడుతూ ట్వీట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. తాను బస్సులో వెళ్తుండగా తన స్నేహితుడు సచిన్ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి పంపించాడని, ఆ ట్వీట్‌ను చూసిన తాను ఎలా స్పందించాలో తెలియక 2, 3 గంటల పాటు ఏ రిప్లై ఇవ్వలేదని పేర్కొన్నాడు. చివరకు తాను రిప్లై ఇచ్చానని తెలిపాడు. సచిన్ లాంటి వ్యక్తులు తనలాంటి ఆటగాళ్లను ప్రశంసించడం.. యువ ఆటగాళ్లకు ఆదర్శనీయమని అన్నాడు. ధోనీ, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ వికెట్లు తీయడం తనకు మర్చిపోలేని అనుభూతినిచ్చిందని రషీద్ పేర్కొన్నాడు.

Comments

comments