Home హైదరాబాద్ అమ్మయిని మోసం చేసిన కేసులో ఐమాక్స్ మేనేజర్ అరెస్ట్

అమ్మయిని మోసం చేసిన కేసులో ఐమాక్స్ మేనేజర్ అరెస్ట్

imax-venkatprasad

మన తెలంగాణ/పంజాగుట్ట : ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసిన ఐమాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే…. ప్రసాద్ ఐమాక్స్‌లో విధులు నిర్వహిస్తున్న స హచర యువతిని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెను శారీరకంగా వా డుకున్నాడు. అనంతరం పెళ్లికి నిరాకరించడంతో సదరు యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకట ప్రసాద్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తులో వెంకట ప్రసాద్ గతంలో సైతం పలువురు యువతుల ను ఇదే తరహాలో మోసం చేసినట్టు తేటతెల్లం అయింది. మొదటి భార్యను వేధింపులకు గురిచేయండంతో 2009లో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వేధింపులు తీవ్రం అవడంతో ఆ మె విడాకులు తీసుకుంది. తనతో పా టు పనిచే సే సిబ్బంది పట్ల అసభ్యం గా ప్రవర్తిస్తూ, వారిని వేధింపులకు గురిచేసే వాడని తెలిసింది. ఇతను  పలు సినిమాల్లో కూడా నటించాడు.