Home వనపర్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

నేర సమీక్షా సమావేశంలో ఎస్‌పి రోహిణీ ప్రియదర్శిని

                     SP

వనపర్తిప్రతినిధిః జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లకు సమస్యలపై వచ్చిన పిర్యాదులను వెంటనే స్వీకరించి తక్షణమే ఫిర్యాదులపై స్పందించాలని జిల్లా ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని పోలీసులను ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు, సిఐలతో కలిసి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె పోలీసులనుద్దేశించి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది కలిసి కట్టుగా పని చేసి రో డ్డు ప్రమాదాలను , దొంగతనాలను అరికట్టాలని ఆమె సూచించారు. కార్యక్ర మంలో డిఎస్పీ జోగుల చెన్నయ్య, కొత్తకోట, ఆత్మకూర్,వనపర్తి సిఐలతో పాటు అన్ని పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.