Home ఆఫ్ బీట్ తోటపనితో రోగనిరోధకశక్తి..

తోటపనితో రోగనిరోధకశక్తి..

ప్రతి ఏడాది జూన్ 6న జాతీయ తోటపని వ్యాయామ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రకంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మొక్కలు కత్తిరించటం, నాటడం ఇలాంటి వాటి ద్వారా శరీరంలోని ఎక్కువ కేలరీలను తగ్గించుకోవచ్చు. కండరాలు దృఢంగా ఉంటాయి. తవ్వటం, నీళ్లు చల్లటం, కలపటం, కత్తిరింపులు, రాకింగ్, వాకింగ్ లాంటివి చేయటం ద్వారా కండ రాలు గట్టిపడి, అదనపు కేలరీలు తగ్గుతాయి. మనలో చాలా మంది తోటలో పని చేసినప్పుడు వచ్చే ఆరోగ్యాన్ని గమనించ లేక పోతున్నారు.

Gardening

ఈపనిలో ముందుకు వెనుకకు నడవటం, ఒంగటం లాంటి వ్యాయామాలు మనం చేస్తాం. తాజా గాలిని పీలుస్తాం. ఇంకా ఉదయం పూట గాని, సాయంకాలాల్లో లేత సూర్యకిరణాలు శరీరం మీద పడి డి విటమిన్ శరీరానికి అందుతుంది. ప్రతిరోజూ తోటపని చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు ఇలా వ్యాయామం చేయడం ద్వారా హృదయ స్పందన రేటును పెంచుతాయి. తోటపని ఒత్తిడిని కూడా నివారించేలా పనిచేస్తుంది. తోటపని వల్ల జీవిత కాలాన్ని మరో ఏడు సంవత్సరాలు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెపుతున్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 నిముషాలు తోటపని చేయాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒబేసిటీ తగ్గి శరీరం దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. పిల్లలు, పెద్దలు తోటపని ద్వారా ఉత్సాహంగా, ఆనందంగా చేసేట్లు ప్రోత్సాహించాలి. అక్కడ ఉండే పచ్చని వాతావరణం కంటికి కూడా మంచిది. రాయల్ హార్టీ కల్చర్ సొసైటీ 2000 మందిని పరిశీలించి ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ప్రయోజనాలను వెల్లడించింది. వారిలో ఎక్కువ శాతం వారికి ఆరోగ్యం మెరుగైందని, మిగతా వాళ్లు తమ ఆలోచనలు గార్డెనింగ్ అయినాక మంచి ఆలోచనలు కలిగాయని చెప్పారు.

ఇలా గార్డెనింగ్ చేస్తూ అదనపు శక్తిని సమకూర్చుకోవడానికి కొన్ని చిట్కాలు చూద్దాం.

* ముందు నెమ్మదిగా చిన్న చిన్న స్టెప్స్‌లతో ప్రారంభించాలి.
* కుడి, ఎడమ చేతులని సమానంగా ఉపయోగిస్తూ పని చేయాలి. మట్టిని పారతో తవ్వి, చదును చేసేటప్పుడు, ఇంకా మట్టి పోగుచేసి మొక్కలను నాటే లాంటి పనులలో ప్రతి పని రెండు చేతులకి ఒక మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుంది. ఇది జిమ్ సెంటర్‌లకు వెళ్లి జిమ్ చేయటం కంటే గార్డెనింగ్ ఎక్సర్‌సైజ్ ఇంకాఎక్కువ ఫలితాన్ని చూపిస్తుంది. సంతోషంగా, ఆనందంగా చేయవచ్చు.
* గాలిని పీల్చటం, వదలటం లాంటి పనులు చేయటం మర్చిపోవద్దు.
* ఎక్కువ మంచినీరుని తాగాలి.
* ఏదైనా ఒక వస్తువును పైకి ఎత్తేటప్పుడు మీ మోకాళ్లను వంచి ఎత్తాలి.
* మీ తోటపనిని ఆస్వాదిస్తూ, ఆనందంగా చేయండి. ఎప్పుడూ దానిని సందర్శిస్తూ ఉండండి.
మిమ్మల్ని మీరు గమనించుకోండిలా…
ఏవైనా పనికిరాని చెట్లు ఉంటే పీకడం, కొత్త మొక్కల విత్తనాలు వేసేటప్పుడు మన కండరాలు కదలి మంచి వ్యాయామం అవుతుంది. ఇలాంటి వాటివి చేసి మన తోటని అందంగా ఉంచుకోవచ్చు. ఇంకా మనకి ఒక మంచి అనుభూతి కూడా కలుగుతుంది. సాంఘిక మాధ్యమాల్లో మీరు ఎలా ఈ జాతీయ తోటపని వ్యాయామ రోజును గడిపారో మీ ఫ్రెండ్స్‌కు తెలియచేయండి.