Search
Wednesday 26 September 2018
  • :
  • :

అమెరికా…. ఇరానా?

చమురు దిగుమతిపై డైలమాలో ప్రధాని మోడీ 

Modi

న్యూయార్క్: ఇరాన్ చమురు దిగుమతిపై అమెరికా విధించిన నిషేధం ప్రధాని నరేంద్ర మోడీని సందిగ్ధంలో పడేసింది. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే భారత్‌కు ఓ విధంగా ప్రయోజనకరమే అయినప్పటికీ ఇరాన్ నుంచి అందే తక్కువ ధర చమురుకు, విదేశీ మారకంకు గండి పడుతుంది. ఇరాన్ నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 900 కోట్ల డాలర్ల మేరకు చమురును భారత్ దిగుమతి చేసుకుంది.

అంతేకాక ఉత్తర అమెరికా ముడిచమురు దిగుమతికి కొన్ని కాంట్రాక్టులు కూడా చేసుకుంది. ఇది భారత్‌కు 24.5 వందల కోట్ల డాలర్ల వాణిజ్య మిగులును అందించనున్నది. పైగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికాతో కలిసి నడవొచ్చు. అమెరికా నుంచే ఎక్కువ ముడిచమురును భారత్ కొంటోంది. ఇరాన్‌తో చమురు కొనుగోళ్లను సామాప్తం చేసుకుంటే నావికా వ్యయంలో భారీ ఆదా, ఇతర సరఫరాదారుల నుంచి దీర్ఘకాలిక పరపతి వంటి ప్రయోజనాలు కలుగుతాయి. చైనాతో అమెరికా చేస్తున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ ప్రయోజనాలు కలుగనున్నాయి.

‘ఇరాన్‌పై అమలుకానున్న ఆంక్షలు భారత్ మార్కెట్‌లో అమెరికాకు మంచి వాణిజ్య అవకాశం కానున్నది’ అని లండన్‌కు చెందిన ఇంటర్‌ఫాక్స్ ఎనర్జీ విశ్లేషకుడు అభిషేక్ కుమార్ అన్నారు. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం ఉద్రిక్తల కారణంగా భారత మార్కెట్‌కు మరింతగా అమెరికా చమురు రానున్నది. ఇరాన్‌పై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించాక ప్రత్యామ్నాయ సరఫరాల కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. అమెరికా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు నెలవారీగా 800 శాతం పెరిగి మే నెల నాటికి 40.72 లక్షల బ్యారెళ్లకు చేరింది.

ఇది 2015 తర్వాత అత్యధిక రాశి అని సమాచారం. ప్రపంచంలో చమురును ఎక్కువగా ఉపయోగిస్తున దేశం భారత్. చమురు దిగుమతుల ద్వారానే 4వందల కోట్ల మిగులును పూడ్చుకోగలదని ప్రభుత్వాధికారులు ఏప్రిల్‌లో చెప్పారు. అయితే అమెరికా నుంచి ఎంత భారత్ కొంటుందనేదానికి పరిమితులు ఉన్నాయి. అమెరికాతో టర్మ్ కాంట్రాక్టులు చేసుకోడానికి భారత అతిపెద్ద చమురుశుద్ధి సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పూనుకుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న స్పాట్ మార్కెట్‌లో కొనుగోలుకు భిన్నంగా ఈ కాంట్రాక్టులు ఉండనున్నాయని ఐఒసి చైర్మన్ సంజీవ్ సింగ్ అన్నారు. ముడిచమురు ఎగుమతిపై నాలుగు దశాబ్దాల నిరోధకాలను అమెరికా ఎత్తేసిన నేపథ్యంలో అమెరికా నుంచి భారత్ ఎక్కువ చమురు కొనేందుకు అవకాశాలున్నాయి.

Comments

comments