Home ఎడిటోరియల్ ప్రాధాన్యతలు మారాయి – ప్రజాస్వామిక చర్చ లేదు

ప్రాధాన్యతలు మారాయి – ప్రజాస్వామిక చర్చ లేదు

Govt.-Schoolsతెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్న తీరుపై గత 4-6 నెలలుగా పత్రికలలో వస్తున్న వార్తలు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. ప్రభుత్వ విధాన ప్రకటనలు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నా పత్రికలు, పౌర సమాజం లేవనెత్తే ప్రశ్నలకు అది ఎందుకు స్పందించటం లేదో అర్థం కాదు. వాటి వెనుక కుట్ర ఉన్నట్లు ఉన్న దని ప్రభుత్వం అంటున్నది.
ప్రజాస్వామ్యంలో పాలకులకు, పాలితులకు మధ్య సంప్రదింపుల పర్వం సాగుతుండాలి. తెలంగాణ లో అది జరగటం లేదు. ఐటి, స్టార్టప్‌లు, కొత్త జిల్లాల ఏర్పాటు, మైనారిటీలకు గురుకుల్ స్కూళ్లు-సంక్షేమ హాస్టళ్ళ గురించి గొప్పగా ప్రచారం జరిగినా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వ నిర్హేతుక విధానాల వల్ల రాష్ట్రం వెనక్కి నడుస్తోందని కళ్లకు కడుతోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఓటర్లకు జవాబుదారీ వహించటం లేదు. ఇది ప్రజలలో భ్రమలు కరిగిపోవ డానికి, నిరాశకు దారి తీస్తోంది. ఈ పరిస్థితివల్ల అసమ్మతి పెరిగి హింసా కాండ కూడా చోటుచేసు కొంటోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తన హామీలను మరచి టిఆర్‌ఎస్‌పార్టీలోకి తెలంగాణపట్ల నిబద్ధ త లేని చాలామందిని వేరే పార్టీల నుంచి తీసు కున్నారు.
టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళిక సోషలిస్టు ఎజెండా ను తలపించింది. రెండు ప్రాజెక్టులు కీలకమైనవిగా అది పేర్కొంది. ఒకటి మిషన్ కాకతీయ, రెండు మిషన్ భగీరథ. సాగు, మంచి నీటి కల్పన పథకాలవి. ఆ పథకాలను ఎవరూ తప్పుబట్టరు. కాని వాటిపై జరగ వలసిన ప్రజాస్వామిక చర్చ జరగ లేదు. ప్రజలతో, మంచి పేరు ప్రతిష్టలు గల నిపుణు లతో కూడా సంప్రదించలేదు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రప్రభుత్వమే సొంత చట్టాలు చేసుకుంది. మార్పు చేసిన కాళేశ్వరం, మల్లన్నసాగర్ పథకాలు ఇబ్బందు ల్లో పడ్డాయి. ఆ ప్రాజెక్టులకు భూము లు ఇవ్వడం ద్వారా జీవనా ధారం కోల్పో వడం ఇష్టంలేని రైతులు కోర్టుకెక్కారు. అతికొద్ది మంది సొంత భూములు కోల్పోడానికి సిద్ధ పడ్డారు.హైకోర్టు మొత్తం భూసేకరణ ప్రక్రియను నిలిపివేసింది. కొద్దిరోజుల క్రితం సన్న కారు రైతు చెట్లపల్లి రాములు ఉన్న ఆధారం పోయిం దన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడి, రిపబ్లిక్ దినో త్సవం నాడు ఆసుపత్రిలో మరణించాడు. పొలాలపై చేసిన అప్పులు తీరక రైతులు ప్రాణాలు తీసుకుంటున్న సమస్య రాష్ట్రానికి కొత్తకాదు. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలను పీడిస్తున్న దుర్భిక్షం నివారణకు ప్రభుత్వం కదలడం లేదు. ఈ విషయంలో సామా జిక కార్యకర్తలు, సంస్థలు చేస్తున్న డిమాండ్లు, సమర్పించిన నివేదికలు పట్టించుకున్న నాథులు లేరు. వెలిగి పోతున్న రాష్ట్రంగా పేరొందిన గుజరాత్ లో కూడా రైతుల పరిస్థితి బాగా ఏమీ లేదు. జనవరి 2003, అక్టోబర్ 2012 మధ్య అక్కడ 692 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గుజరాత్ రైతులకు సంబం ధించిన ఒక ఎన్‌జిఒ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో అన్ని రాష్ట్రాలనూ కలుపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ నిర్ణయం తీసుకొన్నారు. రైతుల దుస్థితి సమగ్రంగా చూపడం కోసం భారత రిజర్వు బ్యాంక్, అన్ని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆ దావా లో భాగస్వాములను చేశారు. పంటల నష్టంవల్ల రైతులు చనిపోవడం ‘మానవ హక్కుల’ అంశమని సుప్రీం కోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో అన్నం పెట్టే రైతులను రక్షించడానికి జాతీయ విధానం ఎందుకు చేపట్టలేదని బెంచ్ ప్రశ్నించింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్య లపట్ల ఏ మాత్రం ఆందోళన ప్రకటించ లేదు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కూడా ఈ విషయంలో సరిగా లేదు. సాగునీటి పథకాల అవసరాన్ని ఎవరూ కాదనరు. అయితే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టులను చేపట్టవలసి ఉంది.
అలాగే ఆరోగ్యం, విద్యారంగాలు కూడా కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల ఆశలకు తగినట్లు కాకుండా కుంటినడక నడుస్తున్నాయి. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒట్టిమాటగా మిగులుతోంది. విద్య కార్పొరేట్‌పరం కావడంతో ప్రభుత్వ స్కూళ్లు పాతాళానికి నెట్టబడ్డాయి. అణగారిన వర్గాల వారు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎస్‌సి లు, ఎస్‌టిలు, బిసిలు, మైనారిటీలు వంటి వివిధ సామా జిక గ్రూపుల కోసం గురుకుల పాఠశాలలను నెలకొల్పుతామని అంటోంది. ఈ ఏడాది 224 గురు కులాలు తెరిచింది. వచ్చే రెండేళ్లలో మరి 500 నెల కొల్పాలన్నది సంకల్పం. మొత్తం 20,299 టీచర్ ఉద్యోగాలు భర్తీ కావలసి ఉంది. మూతపడ్డానికి దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి గురించి అనేక పత్రికలు రాస్తున్నాయి. ప్రస్తుత హైస్కూళ్లలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తారని ఆశ లేదు. ప్రభుత్వ స్కూళ్లలో 10,000 దాకా ఉద్యోగాల ఖాళీలు ఉనాయి అందు లో మూడింట రెండు వంతులు హైస్కూళ్లు. చాలా మంది విద్యార్థులు గురు కులాలకు వలసపోయే పరిస్థితి ఉంది. వాటిలో బోధనా మాధ్యమంగా ఇంగ్లీషు ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు రాయడం, చదవడం అంతగా రాదని విద్యాశాఖ నివేదిక ఒకటి వెల్లడించింది. అక్కడ ఇంగ్లీష్ ప్రవేశపెట్టినా టీచర్లకు ఇంగ్లీషులో బోధించే సమర్థత లేదు. 20 శాతం మంది టీచర్లు కూడా ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకోలేదు. అసలు ప్రభుత్వ స్కూళ్లను ఇంత ఘోరంగా ఎందుకు మార్చారన్నది మౌలిక ప్రశ్న. వాటిని గురుకుల పాఠశాలలుగా మార్చలేమా? అలా మార్చి తగిన వనరు లను బదిలీ చేసి, టీచర్లకు అవసర పడిన మౌలిక సౌకర్యా లను కల్పించి, సుశిక్షితులయిన టీచర్లను నియ మించడం ద్వారా వాటిని బాగుపరచ లేమా? సమీప భవిష్యత్తులో అవి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీపడే స్థాయికి ఎదుగుతాయి అనే ఆశలు నిజం కాకపోవచ్చు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనా రిటీలకు వేరే గురుకులాలు అసలెం దుకు? అది సమాజంలో విభజన ధోరణులను ప్రోత్స హించటం కాదా? వేర్వేరు సామాజిక వర్గాల నుండి వచ్చిన విద్యార్థులు ఒకచోట కూడడం వారిని కలిసి ఉంచే ప్రక్రియగా మారుతుంది. అంతేకాక సమా జాన్ని మరింత సమగ్రంగా అర్థం చేసుకోవడం లో వారికి దోహదపడు తుంది. అసలు విషాదం ఏమిటంటే స్కూలు విద్య సమ స్యలపట్ల ప్రభుత్వ వైఖరి లో చిత్తశుద్ధి కొర వడుతోంది. ఐటి విద్య, స్టార్టప్‌ల గురించి గొపగా ప్రకట నలు ప్రభుత్వం చేస్తోంది. సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి గురించి ఉత్సాహంగా పలికినంతగా మౌలిక విద్య, ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఉస్మానియా యూని వర్శిటీ లో ఖాళీ అయిన ప్రొఫెసర్ పదవులను చాలాకాలంగా భర్తీ చేయటం లేదు. కాంట్రాక్ట్ టీచర్లు తమ సర్వీసులను క్రమబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త టెక్నాలజీ లను అందుబాటులోకి తేవడం కోసం ఒక తరం మొత్తాన్ని ఉన్నత విద్య స్థాయికి ఎదిగేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఇది తప్పదు.
తెలంగాణలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నీళ్ల కొరత వల్ల సంక్షేమ హాస్టళ్ళలో టాయిలెట్లను వాడే పరిస్థితి లేదు. కాలకృత్యాల కోసం విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. మెదక్‌లో బిసి విద్యార్థినుల హాస్టల్‌కు బాత్రూంలు లేవు. మంచినీటి చెరువు వద్ద బహిరంగ ప్రదేశంలో వారు స్నానాలు చేయవలసి వస్తోంది. పడకలు, దుప్పట్లు సరిపడేంత లేవు. సమాజంలో అత్యంత అణచి వేతకు గురైన వర్గాల పిల్లలకు ప్రీ స్కూల్ కేంద్రాలుగా ఉండాల్సిన అంగన్ వాడీలు తగి నన్ని గదులు , సుశిక్షితులయిన సిబ్బంది లేక సమస్యల సుడిగుండంలో చిక్కు కున్నాయి. ఈ కేంద్రాలను ప్రాథమిక స్కూళ్లలో విలీనంచేసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నా యి.
రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో నిలోఫర్ ఒకటి. ఆ ఆసుపత్రిలో కొత్తగా పుట్టిన శిశువుల, బాలింతల మరణాల మూలంగా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియ మించింది. ఉస్మానియా, గాంధీ రెండుప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కూడా అంతే దిగజారుడుగా ఉంది. ప్రభుత్వా సుపత్రులను క్షీణించిపోయేలా చేసి చివరకు మూసేయడమే ఎత్తు గడలా కనిపిస్తోంది. సరైన సంఖ్యలో పడకలు లేక పోవడం, మందులు-డాక్టర్లు-నర్సుల కొరత ప్రభు త్వాసు పత్రులను పట్టిపల్లార్చుతున్నాయి. కొన్నేళ్లుగా వైద్య రంగం ప్రైవేటైజేషన్ వల్ల కార్పొరేట్ ఆసుపత్రు లు పెరిగాయి. ఆరోగ్యమన్నది లాభార్జనకోసం మార్కె టింగ్ సరుకుగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రు ల్లో అమ్మే ఆరోగ్యాన్ని హెచ్చు ఖరీదుకు ప్రజలు కొను క్కొనే పరిస్థితిని ప్రభుత్వం కావాలనే అనుమతి స్తోందా? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయితే పూర్తిగా లేకుండా పోయాయి లేదా వాటిని వాడ కుండా మూలన పెట్టారు.
రాజ్యాంగానికి తీసుకువచ్చిన 73,74 సవరణ లు దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పంచాయతీ లను గ్రామసభలను పునాది వ్యవస్థలుగా చేశాయి. పంచాయతీ సర్పంచ్‌లను రాజుల్లా/రాణుల్లా మార్చు తామని, నిధులు నేరుగా వారికే అందేలా చూస్తామని తెలంగాణ ప్రభుత్వం నాలిక చివర హామీలు గుప్పించి ప్రస్తుతం మరిచిపోయింది. రోడ్లు వేయడం వంటి చాలా పనులకు 80 శాతం నిధులు ఎంఎన్ ఆర్‌ఇజి (గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద రాష్ట్రాలకు లభిస్తాయి. తక్కిన 20 శాతం రాష్ట్రాలు సొంతం గా భరించాలి లేదా ఎంఎల్‌ఎ, ఎంపి లాడ్స్ నిధుల ద్వారా లేదా విరాళాల ద్వారా ఆ 20 శాతం నిధులు పంచా యతీలు సమకూర్చుకొన్న తర్వాతే 80 శాతం నిధు లు వస్తా యి. ఈ నియమం వల్ల చాలా పనులు నిలిచి పోయా యి.
ప్రజల డిమాండ్లను పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. అది నిధుల కొరత వల్లా లేక ప్రాధాన్యతలు మారడంవల్లా అన్నది అర్థం కావడం లేదు. ప్రాధాన్యతలు మార డమే కారణమంటేనే నిజానికి దగ్గరగా ఉంటుంది. ఇదంతా చెప్పేది టిఆర్‌ఎస్ ప్రభుత్వా న్ని తక్కువ చేసి చూపడానికి కాదు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, విలాంగులకు పెన్షన్లు వంటి చర్యలు వారికి ఊరట కలిగిస్తాయి. పేదలకు రెండు బెడ్ రూంల ఇళ్ల నిర్మాణం, మైనారిటీలకు రిజర్వేషన్లు వంటి హామీలు అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా పథకాల అమలు ప్రక్రియను పటిష్ఠపరచి ప్రజలకు మేలు చేకూర్చు తారన్న ఆశతోనే ఇదంతా చెప్పడం. దేవుళ్ల సేవలకేమీ తొందర లేదు. మెరుగైన విద్య, వైద్య సదుపాయాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవాలి. విమర్శను తోసిపుచ్చ డానికి బదులు టిఆర్‌ఎస్ పాలకులు ఆత్మవిమర్శ చేసుకుని ఇప్పటికే పేరుకుపోయిన విశ్వాస లోటును పూడ్చుకోవడానికి ప్రజలతో ప్రజాస్వామిక చర్చకు పూనుకోవాలి.