Search
Wednesday 26 September 2018
  • :
  • :

మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం: వనజీవి రామయ్య

Importance of Plants to humans and animals

వనజీవి రామయ్య
మనతెలంగాణ- మరిపెడ: మొక్కలు మానవ మనుగడకు, ప్రగతికి జీవనాధారంగా నిలుస్తాయని వనజీవి రామయ్య పేర్కొన్నారు. శనివారం మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. మొక్కలు పెరిగి పెద్దయ్యి అవి నీడనిస్తాయని, ప్రగతికి, పశుపక్షాదులకు అవసరమయ్యే ఫలాలను ఇస్తాయని అన్నారు. మానవ విలసాలకు కలప, ఇండ్ల నిర్మాణాలలో నూతన అంగులను రూపొందించుకోవటంలో ఇలా అనేక విధాలుగా మానవ మనుగడకు ఉపయోగపడే మొక్కలను పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ రామారావు, మరిపెడ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారు రవి, అరుణాదేవి, వైద్య బఋందంత, వెంకటేశ్వర్లు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments