Home రాష్ట్ర వార్తలు మంచినీటికి ప్రాధాన్యం

మంచినీటికి ప్రాధాన్యం

జిల్లా కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్‌లో కెటిఆర్

ktrహైదరాబాద్: గ్రామాల్లో మంచినీటి ఎద్దడిపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కె. తారక రామారావు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల వారీగా నీటి ఎద్దడి, మంచి నీటి సరఫరా స్థితిగతులను సమీక్షించుకుని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మంచినీటి సరఫరాపై అశ్రద్ధ వహించరాదని, క్రియాశీలకంగా పని చేయాలని ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జిల్లాల్లో  నీటి ఎద్దడిని గ్రామాల వారీగా సమీక్షించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలు పెండింగ్ విద్యుత్ ఛార్జీల బకాయిలపై ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీల బకాయిలను చెల్లించేలా పంచాయతీలను ప్రొత్సహించాలని సూచించారు. పంచాయతీలకు భారంగా మారిన కరెంటు బిల్లులను తగ్గించుకునేందుకు వీధిలైట్లకు ప్రత్యేకంగా కరెంటు వైర్ ( మూడో వైర్)ను ఏర్పాటు చేసుకుని రోజు వారీగా కరెంటు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఇక మున్సిపల్ శాఖపైన కూడా మంత్రి  ఈ సందర్భంగా కలెక్టర్లకు కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికే ప్రకటించిన వంద రోజుల ప్రణాళికను పూర్తి చేసేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుద్దంపై దృష్టి సారించాలని, వీలైనంత వరకు బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా 11 వేల మరుగుదొడ్ల నిర్మాణ లక్షాన్ని పూర్తిచేయాలన్నారు. జూన్ 2 నాటికి ఈ లక్షాన్ని పూర్తి చేయాలని అనుకున్నా అప్పటిలోగానే ఏప్రిల్ నాటికే పూర్తి చేస్తే గనుక కేంద్రం నుండి స్వచ్ఛభారత్ అభియాన్ కింద నిధులు సమకూరే అవకాశం ఉందని కలెక్టర్లకు మంత్రి కెటిఆర్ సూచించారు. 100 రోజుల లక్ష్యాన్ని పూర్తి చేసే మున్సిపాలిటీలకు ప్రొత్సాహకంగా మరిన్ని నిధులు అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 25 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎల్‌ఇడి ల్యాంపులు బిగింపు లక్షాన్ని పూర్తి చేసేందుకు విద్యుత్ అధికారులతో కలిసి పని చేసే లక్షాన్ని పూర్తి చేయాలన్నారు. ఇందులో భాగంగా రెండు లక్షల 70 వేల బల్బులను బిగించనున్నామన్నారు. ఎల్‌ఈడి ల్యాంపుల వినియోగంపై గృహ వినియో గదారుల్లోనూ చైతన్యం తీసుకురావాలని కలెక్టర్లకు మంత్రి కెటిఆర్ సూచిం చారు. రూ. 75  ఉన్న బల్బులను బిగింపు ఖర్చుల కింద విద్యుత్ శాఖ పది రూపాయలనే ఛార్జ్ చేయనుందని ఆయన తెలిపారు. కేంద్ర మున్సిపా లిటిల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు ఇస్తున్న నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటి, నగర పంచాయతీల్లో డంప్ యార్డుల కోసం సుమారు 5 నుండి 7 ఎకరాల భూమి సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సేకరణ పూర్తి కాగానే మున్సిపల్ శాఖకి అప్పగిం చాలన్నారు. మున్సిపాలిటిల్లో నీటి ఎద్దడి నివారణకు  చర్యలు తీసుకో వాలని, బోర్లను కొత్తగా తవ్వకుండా పాత బోర్లలోనే మరింత లోతుగా చేస్తే నీరు వచ్చే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి ఎంజి. గోపాల్, పరిశ్ర మలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, సిడిఎంఏ దాన కిశోర్ తదితరులు పాల్గొన్నారు.