Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మానసిక ఒత్తిడికి మెరుగైన వైద్యం

mental

తల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ఎక్కువగా ఉండి ఏ పని చేయడం కుదరదు. దీంతో పాటుగా వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, పెద్ద పెద్ద శబ్దాలు భరించలేక పోవటం, వెలుతురును సరిగ్గా చూడలేక పోవుట, కళ్లకు చీకటి వచ్చినట్లుగా అనిపించటం వంటి లక్షణాలతో బాధ పడుతుంటారు. కొందరిలో తలనొప్పి ఒకే వైపుకు వచ్చి వేధింస్తుంది. ఇలాంటి తలనొప్పిని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పి తీవ్రత క్రమక్రమంగా పెరిగి క్రమంగా తగ్గుతుంది. నొప్పి భరించలేకుండ వుండి తల దిమ్ముగా ఉంటుంది.
కారణాలు : అధిక మానసిక ఒత్తిడి వల్ల మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది. మెదడు కణాలలో కణుతులు ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తలకు గాయాలు తగలడం గాని కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్ వల్ల కూడ తలనొప్పి వస్తుంది. కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల సైతం తలనొప్పి వచ్చి వేధిస్తుంది.
జాగ్రత్తలు: మొదటగా మానసిక ఒత్తిడి నివారణకు యోగా, మెడిటేషన్, ప్రాణాయామం నిత్యం చేయాలి. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దాలు లేని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లకు స్వస్తి పలికి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలకు, తాజా పండ్లును తీసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నీరు అధికంగా తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ ఉండాలి. ప్రతి రోజూ వేకువజామున లేచి 45 నిమిషాల పాటు నడవటం అలవాటు చేసుకోవాలి. తద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తల నొప్పి తీవ్రత తగ్గును.
చికిత్స: తలనొప్పే కదా అని వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్రపరిణామాలకు దారి తీస్తుంది. హోమియోవైద్యంలో తల నొప్పికి మంచి చికిత్స ఉంది. ఈ వైద్య విధానంలో మందును ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగనలోకి తీసుకొని మందును ఎన్నుకోవడం జరుగుతుంది. దీంతో వ్యాధి నివారణ సమూలంగా జరుగుతుంది.
మందులు: బ్రయోనియా, సాంగ్వినేరియా, స్సైజీలియా, జెల్సిమియం, సైలీషియా, కాలీబైక్, సెపియా, నైట్రోమోర్, కాల్కేరియా ఫాస్ వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నుకొని వైద్యం చేసిన తలనొప్పి నుండి విముక్తి పొందవచ్చును.

డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ హోమియోఫిజీషియన్,
హన్మకొండ.

Comments

comments