Search
Saturday 17 November 2018
  • :
  • :

వీపనగండ్ల ప్రభుత్వాసుపత్రిలో…రోగులకు మెరుగైన వైద్యసేవలు

building* ఆసుపత్రిలో సాధారణ కాన్పులు పెరిగే అవకాశం..
* రూ.3.50కోట్ల నిధులతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు..

మన తెలంగాణ/వీపనగండ్ల:మారుమూల ప్రాంతమైన మండల కేంద్రంతోపాటు మండల పరిధి లోని గ్రామాలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో 6 పడకల నుండి 30 పడకల వరకు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్త ర్వులు జారీ అయ్యాయని మండల వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. వీపనగండ్ల ఆసుపత్రి లో కేవలం మహిళలకు మాత్రమే వైద్యసేవలు అందించేవారు . ఆసుపత్రికి సంబంధించిన ఎఎన్ ఎంలు, వైద్యసిబ్బంది, నర్సులు ప్రభుత్వం నియామకం చేయనున్నట్లు డాక్టర్ శ్రీనివాసులు తెలిపా రు. రూ.3.50కోట్ల నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. 80 శాతం నిర్మాణం పూర్తి అయిందన్నారు.
30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మౌళిక సదుపాయాలు..
మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్, డాక్టర్‌లతో పాటు గైన కాలజిస్ట్ ,చిన్న పిల్లల వైద్యులు,దంత వైద్యులను నూతనంగా నియమించనున్నట్లు ఆయన తెలిపా రు. హెడ్‌నర్సులు,స్టాఫ్‌నర్సులు, రేడియోగ్రఫర్స్ , ఎక్స్‌రే , ప్రభుత్వ ఆసుపత్రిలో మౌళిక సదు పాయాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు. మెరుగైన చికిత్స కోసం రోగులు వైద్యబృందం కృషి చేస్తుందన్నారు. ప్రమాదకర సంఘటనలు, పాముకా టుకు,కుక్కకాటుకు రోగు లకు అందుబాటులో 24 గంటల వైద్యసదుపాయంను కల్పిస్తామన్నారు. ప్రతి రోజు రోగులు 30 మంది నుండి 40 మంది వరకు రాగా మెరుగైన చికిత్స కోసం 30 పడకల ఆసుపత్రితో మండలంలో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆసుపత్రిలోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాసులు కోరారు.

ప్రజలకు తీరనున్న ఆరోగ్య సమస్యలు
వీపనగండ్ల ,చిన్నంబావి మండల కేంద్రంతో పాటు మండలాల పరిధిలోని గ్రామాల ప్రజ లకు మెరుగైన చికిత్స కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు .రవాణా వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. మెరుగైన చికిత్స అందించిందేకు 24 గంటల ఆసుపత్రి సేవల ను ప్రజలకు అందిస్తామన్నారు. పంచాయతీరాజ్ ,గ్రామీ ణాభివృద్ధి శాఖా మంత్రి కృష్ణారావు కృషితో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. సాధారణ కాన్పుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేస్తున్నామని మన తెలంగాణతో తెలిపారు.

Comments

comments