Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మెరుగైన బోధనావిధానం

TEACHER1యునెస్కో ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 5న దాదాపు 100 దేశాలకిపైగా ఉపాధ్యాయ దినం 1994వ సం॥ నుండి జరుపుకోవటం ఆనవాయితీ. అయితే మన దేశంలో మాత్రం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పరంగా జన్మదినం అనగా సెప్టెంబర్ 5న వారి సేవలను గుర్తు చేసు కుంటూ ఉపాధ్యాయదినం జరుపు కుంటు న్నాం. ఈ రోజుల్లో మన దేశంలో చదువుతున్న/ చదువుకున్న యువత పెద్ద చదువు కోసం వెళ్ళటం, వారి పిల్లలు ఆయా దేశాల్లో చదువులు కొన సాగించటం జరుగుతున్నది. దేశంలో చదివి, విదేశాలకు పోయి చదువు కొనసాగించే పిల్లలమీద చేసిన పలు సర్వేలలో వెల్లడైన విషయాలు ః 1.విదేశాల్లో చదువులపై ఒత్తిడి తక్కువ 2. టీచర్ కేవలం పాఠాలు చెప్పి వెళ్ళకుండా ప్రతి విద్యార్థి స్థితిగతులపై శ్రద్ధ చూపించి ఎదుగుదలకి తోడ్పడేవారు. 3. చదివినావా లేదా అని అడిగే బోధనా వ్యవస్థ మనదైతే, ఎందుకు అది చదువుతున్నావు, అది ఎలా చదివితే తలకెక్కు తుంది, దానికి ప్రయోగ పూర్వక వివరణలు ఇవ్వటం అనేదానికి విదేశీ విద్యా విధానం ప్రాధాన్యం ఇస్తుంది. ఇంతటి బృహత్ కార్యానికి ఉపాధ్యా యులకి రకరకాల బోధనా పద్ధతులు తెలుసుండాలి. ప్రతి బోధనాపద్ధతికి మంచి చెడులు బేరీజు వేసు కునే ఆలోచన ఉండాలి, ప్రతి ఉపాధ్యాయుడికి ముఖ్యంగా విద్యాహక్కులు-బాధ్యతల గురించి తెలుసుండాలనే యునెస్కో ప్రపంచ ఉపాధ్యాయదినం రోజు చెప్పాలను కుంటున్న విషయాలు. పై విష యాలపై పట్టు ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు సర్వం తానై విద్యార్థిని నడిపించ గలడని మనం తారే జమీన్‌పర్, బ్లాక్ సినిమాలలో చూశాం.

సినిమాల సంగతి పక్కన పెడితే స్వతహాగా ఆచార్యవృత్తిలో ఉన్న నేను వైద్యవిద్యలో పలు బోధనా పద్ధతులపై/పద్ధతులతో విద్యార్థులకి బోధించాను. చేసిన రకరకాల బోధన పద్ధతులలో నాకు అర్థమైంది ఎంతవరకు ఉపాధ్యాయుడు పిల్లలనుండి సమాధానం సునాయాసంగా రాబట్ట గలడనేదే. మణిపాల్ వైద్య కళాశాల లో లెక్చరర్‌గా పనిచేసిన నేను అక్కడి అయిన పద్ధతులని, ప్రస్తుతం విదేశా ల్లో నేను బోధిస్తున్న పద్దతులని బేరీజు వేసుకుంటే దేశంలో అనుసరించిన సాంప్రదాయ వైద్యవిద్య కంటే విదేశాల్లో జరుగుతున్న సమస్యపూర్వక వైద్యవిద్యా పద్ధతులే విద్యార్థులకి మంచి ఫలితాలు ఇస్తున్నాయని బోధపడింది. టీచర్ వచ్చారు, పాఠాలు చెప్పారు, పోయారు అనేది సాంప్రదాయ విద్య పాలసీ, టీచర్ వచ్చారు..పిల్లలని ఎలా పాఠ్యాం శంలో మమేకం చేసి సమాధానాలు రాబట్టారన్నది సమస్య పూర్వక విద్య పాలసీ. అందుకే కాబోలు సమస్య పూరక విద్యలో నిష్ణాతులైన విద్యార్థులకి విషయ విశ్లేషణ సామర్థాలు ఎక్కువని పరిశోధనలు చెపుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో అమలవుతున్న ఈ క్రొత్తపద్ధతులు మనదేశంలో కూడా ప్రాథమిక విద్యనుండి ఉన్నత విద్యవరకు అమలైనప్పుడే ప్రపంచ నలుమూలల జరిగే విద్యాబోధన పద్ధతులు టీచర్లకి – విద్యార్థులకి తెలిసే అవకాశముంటుంది, తద్వారా ప్రపంచస్థాయిలో జరిగే విద్యాభివృద్ధి క్షేత్రస్థాయిలో ఫలాలనిస్తుంది.
(నేడు ప్రపంచ ఉపాధ్యాయదినం సందర్భంగా)

Comments

comments