Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మోడీపై నిప్పులు చెరిగిన ఇమ్రాన్‌ఖాన్

IMran-khan-dire-on-modi

ఇస్లామాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విరుచుకుపడ్డారు. కశ్మీర్‌లో ఎన్ డిఎ సర్కార్ చేస్తున్న అన్ని అనాగరిక చర్యలకు మోడీ ప్రభుత్వం పాకిస్థాన్‌నే నిందిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో ఇండియాతో సత్సంబంధాల కోసం ఎంతగానో కృషి చేశారని ఇమ్రాన్ చెప్పారు. మోడీని తన ఇంటికి పిలిచిన విషయాన్ని కూడా ఇమ్రాన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాక్ ను అంతర్జాతీయ స్థాయిలో ఒంటరని చేసే ప్రయత్నం భారత్ చేస్తున్నదని పేర్కొన్నారు. తద్వార రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శలు గుప్పించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడారు. పాకిస్థాన్‌లో విజయం సాధించాలంటే  డబ్బు, శిక్షణ పొందిన పోలింగ్ ఏజెంట్లు కావాలని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వంపై మిలిటరీ ప్రభావం ఉండటంపై కూడా ఆయయన స్పందించారు. ఏ పార్టీ కూడా మెరుగైన పాలనను అందించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచంలోనే తమది మరీ చెత్త ప్రభుత్వమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయిన ప్రభుత్వం అవినీతి, అక్రమాలు చేస్తే ప్రజలు మిలిటరీని సాదరంగా ఆహ్వానిస్తారని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ చూసిన అత్యుత్తమ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో అని ఆయన గుర్తుచేశారు. జులై 25న జరిగే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్న పార్టీల్లో ఇమ్రాన్ ఖాన్ పిటిఐ ముందు వరుసలో ఉందని పలు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Comments

comments