Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఇమ్రాన్ ప్రమాణం వాయిదా?

Imran Khan Oath Taking May be Postponed to August 14th

ఇస్లామాబాద్: పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ దేశ స్వాతంత్య్ర దినోవత్సం ఆగస్టు 14న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తానన్న కోరినకు ఇమ్రాన్ ఖాన్ గతంలో వెలిబుచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోవత్సం ఆగస్టు 14న ప్రమాణ స్వీకారం చేయాలనేది, తనతోపాటు తాత్కాలిక ప్రధానమంత్రి, రిటైర్డ్ న్యాయమూర్తి నసీరుల్ ముల్కీ కోరిక అని తాత్కాలిక న్యాయ శాఖమంత్రి అలీ జాఫర్ శుక్రవారం డాన్ దిన పత్రికకు తెలిపారు. ఆగస్టు 11, 12 తేదీల్లో తాజా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 14న ప్రధానమంత్రి ఎన్నిక జరుగుతుందని, అదే రోజు కొత్త ప్రధానమంత్రి చేత అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 11న నేషనల్ అసెంబ్లీ (ఎన్‌ఎ)సమావేశమైనట్లైతే, అదే రోజు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగుతుందని న్యాయశాఖ మంత్రి వివరించారు. అయితే నేషనల్ అసెంబ్లీ ఆగస్టు 12న సమావేశమైనట్లైతే ప్రధానమంత్రి ఎన్నిక ఆగస్టు 15న జరుగుతుందన్నారు.

Comments

comments