Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారం

Imran-khan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ 22వ  ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్, పిటిఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇమ్రాన్ చేత ఆ దేశ అధ్యక్షుడు మామూన్ హుస్సేన్  ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ భజ్వా, ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వార్ ఖాన్, నావెల్ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహముద్ అబ్బాసీ, ఇమ్రాన్ భార్య బుష్రా ఇమ్రాన్ తో పాటు నటుడు జావిద్ షేక్‌, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, రమీజ్ రాజా, వసీం అక్రమం, గాయకులు సల్మాన్ అహ్మద్, అబ్రూల్ హక్ తో పాటు  పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

పార్లమెంటులోని దిగువ సభలో మొత్తం 342 సభ్యులుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 172 ఓట్లు కావాలి. ప్రధాని పదవికి పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అభ్యర్థి షాబాజ్ షరీఫ్ నామినేషన్లు దాఖలు చేశారు.  ప్రధాని ఓటింగ్ వివిధ గ్యాలరీల్లో సభ్యుల విభజన ద్వారా ఓటింగ్ బహిరంగంగానే జరిగింది. ఓటింగ్ జరిగేప్పుడు పిపిపి శాసనసభ్యులు తమ సీట్లలోనే కూర్చుండిపోగా, జమాత్‌ఇఇస్లామీ ఓటింగ్‌లో పాల్గొన లేదు. ఓటింగ్ నుంచి గైర్హాజరు కావొద్దని బిలావల్ భుట్టో జర్దారీని షాబాజ్ షరీఫ్ కోరినప్పటికీ ఆయన తనను మన్నించమని తప్పుకున్నారు. ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు చిన్నాచితక పార్టీల మద్దతు లభించింది. సమావేశానికి ముందు ఇమ్రాన్ ఖాన్, షాబాజ్ షరీఫ్ కరచాలనం చేసి ఒకరినొకరు గ్రీట్ చేసిన విషయం తెలిసిందే.

Siddhu

Comments

comments