Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఆగస్టు 11న ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారం

Pak : Imran Khan Will Take Oath As Pak PM On August 11th

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ తెహ్రికె ఇన్సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ పాక్ ప్రధానిగా ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 25న జరిగిన పాక్ ఎన్నికల్లో పిటిఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయనకు తగిన మెజార్టీ లేదు. పిటిఐ 116 స్థానాల్లో విజయం సాధించింది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పిఎంఎల్(ఎన్) 64 స్థానాలు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 43 స్థానాలను కైవసం చేసుకున్నాయి. పలు చిన్న పార్టీలు ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పిటిఐకి మద్ధతు తెలిపాయి. ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, పిఎంఎల్(ఎన్), పిపిపిలు ఏకమై ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్ ఆ రెండు పార్టీలను ఏవిధంగా నిలువరిస్తారోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Imran Khan Will Take Oath As Pak PM On August 11th

Comments

comments