Search
Sunday 23 September 2018
  • :
  • :

ఇమ్రాన్ పార్టీకి అదనంగా 33 సీట్లు

158కి చేరిన పిటిఐ బలం
మ్యాజికల్ ఫిగర్‌కి 14 తక్కువ

Imran-Khan-Party

ఇస్లామాబాద్ : ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని  ది పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ( పిటిఐ )కి ఎన్నికల సంఘం 28  స్త్రీల రిజర్వుడ్ స్థానాలను కేటాయించింది. వీటితోపాటు ఐదుగురు  ముస్లిమేతర సీట్లని కేటాయించింది. దీంతో  నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 158 మంది సభ్యుల బలం లభించింది. సాధారణ మెజార్టీకి ఇంకా కేవలం 14 మంది సభ్యుల మద్దతు అసరముంటుంది. రిజర్వ్ చేసిన  స్థానాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో  పోటీ చేసిన పార్టీలకు పంచింది. ఆయా పార్టీల అభ్యర్థులు గెలిచిన సీట్ల ఆధారంగా ఈ పంపకం జరిగింది.

జాతీయ అసెంబ్లీ సీట్లలో మహిళలకు రిజర్వు చేసిన  సీట్లు 60 ఉన్నాయి. 10 సీట్లు మైనారిటీలకు కేటాయించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పంజాబ్‌లోని 16 మహిళల సీట్లు దక్కాయి. సింధ్‌లో  4, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో 7, బెలూచిస్తాన్‌లో, డాన్ నుంచి ఒక్కో సీటు దక్కాయి. పాకిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైన ఆయన పార్టీకి ముస్లింలు కాని  10 సీట్లలో 5 సీట్లు దక్కాయి.

మిగిలిన వాటిలో 2 పాకిస్తాన్ ముస్లిం లీగ్ ( నవాజ్ ), 2 పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఒకటి ఎంఎంఎకి దక్కాయి. సాధారణ మెజార్టీకి  ఇమ్రాన్ పార్టీకి ఇంకా 14 మంది సభ్యుల మద్దతు అవసరం. ఆయన చిన్న పార్టీల ప్రజా ప్రతినిధులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 172ని దాటామని పిటిఐ ప్రకటించింది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల  సంఖ్య 342. ఈ వారంలోనే మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్  కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Comments

comments