Home ఎడిటోరియల్ ఇమ్రాన్ సఫలమవుతాడా?

ఇమ్రాన్ సఫలమవుతాడా?

Pak Cricketer Support to Imran khan

పాకిస్థాన్ రాజకీయాల చంచలత, నాటకీయత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ తాజా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆయన 19వ ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. చంచల చిత్తుడైన ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారం లేదా పరిపాలన అనుభవం లేదు. సైనిక తిరుగుబాట్లమయమైన పాకిస్థాన్ చరిత్రలో, ఒక పౌర ప్రభుత్వం నుంచి మరో పౌర ప్రభుత్వానికి అధికారం మార్పిడి ఇది రెండవ పర్యాయం మాత్రమే.
ఇమ్రాన్ ఖాన్ హయాంలో పాకిస్థాన్ అంతర్గత రాజకీయాల్లో, విదేశాంగ విధానంలో అద్భుతమైన మలుపు రావచ్చు. అయితే అతనికి సైన్యం ఎంత వెసులుబాటు ఇస్తుందో వేచిచూడాలి. ఇమ్రాన్‌ఖాన్ ఊహలకందని వ్యక్తి. అతడు 1996లో అవినీతి వ్యతిరేక, సామాజిక న్యాయం ఎజెండాతో పార్టీ స్థాపించాడు. నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్), హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అతన్ని గట్టిగా వ్యతిరేకించాయి.

రాజకీయాల్లో సైన్యం జోక్యానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న నవాజ్ షరీఫ్‌ను తొలగించేందుకై సైన్యం ‘సుతిమెత్తని తిరుగుబాటు’ నిర్వహించినట్లు భావించబడుతున్నది. సైన్యం ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయాలకు తదుపరి నాయకునిగా ఇమ్రాన్‌ఖాన్‌కు తోడ్పాటిచ్చింది. ఎన్నికలను మొత్తంగా అదే పర్యవేక్షించింది పోలింగ్ బూత్‌లనే కాదు, ఓట్ల లెక్కింపు కేంద్రాల లోపల సైనికుల నుంచి లెక్కింపు వరకు అదే పర్యవేక్షించింది. 10.6 కోట్ల మంది అర్హులైన ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన 85 వేల పోలింగ్ బూత్‌లకు 3,76,000 మంది సైనికులను, 8 లక్షల పోలీసులను నియమించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఇమ్రాన్‌ఖాన్ పిటిఐ మినహా అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

పాకిస్థాన్ మూడుకాళ్ల రాజకీయ జంతువు ఇస్లాం, సైన్యం, కశ్మీర్ ఆ మూడు కాళ్లు. తీవ్రవాదం, వేర్పాటువాదం, హింస వగైరా ఇస్లాం పేరుతో జరుగుతుంటాయి. సైన్యానికి పాకిస్థాన్ రాజకీయాలపై ముఖ్యంగా భద్రత, విదేశాంగ విధాన విషయాల్లో బలమైన పట్టు ఉంది. ఏ ప్రధాన మంత్రీ దీన్ని విజయవంతంగా ప్రతిఘటించలేదు. కశ్మీర్‌ను భారతదేశం “వివాదాస్పదంగా కలుపుకుందంటూ గోలచేయకుండా ఏ ప్రధానీ పాకిస్థాన్ రాజకీయాల్లో మనుగడ సాగించలేడు. పాకిస్థాన్‌లో ఎన్నికలు ఈ మూడు తప్పనిసరి అంశాల ఆలింగనం, ప్రభావం నుంచి తప్పించుకోలేవు.
ఈ పూర్వరంగంలో చూచినపుడు, జులై 25 ఎన్నికలు ఇందుకు మినహాయింపు కాదు. ఈ ఎన్నికలు వివాదాలు, టెర్రరిస్టు హింస, సైన్యం రాజకీయ కుతంత్రాలతో కూడుకున్నాయి. సిట్టింగ్ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు, పిఎంఎల్‌ఎన్ నాయకత్వానికి వారసురాలైన ఆయన కుమార్తె మరియంకు అవినీతి ఆరోపణలపై 10 సంవత్సరాలు ఖైదు విధించబడింది. వారిపైగల అభియోగాల దృష్టితో చూచినపుడు దీన్ని కఠినమైన శిక్షగా అనేకమంది న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో సైన్యం జోక్యానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న నవాజ్ షరీఫ్‌ను తొలగించేందుకై సైన్యం ‘సుతిమెత్తని తిరుగుబాటు’ నిర్వహించినట్లు భావించబడుతున్నది. సైన్యం ఇప్పుడు పాకిస్థాన్ రాజకీయాలకు తదుపరి నాయకునిగా ఇమ్రాన్‌ఖాన్‌కు తోడ్పాటిచ్చింది. ఎన్నికలను మొత్తంగా అదే పర్యవేక్షించింది పోలింగ్ బూత్‌లనే కాదు, ఓట్ల లెక్కింపు కేంద్రాల లోపల సైనికుల నుంచి లెక్కింపు వరకు అదే పర్యవేక్షించింది. 10.6 కోట్ల మంది అర్హులైన ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన 85 వేల పోలింగ్ బూత్‌లకు 3,76,000 మంది సైనికులను, 8 లక్షల పోలీసులను నియమించింది. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఇమ్రాన్‌ఖాన్ పిటిఐ మినహా అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌కు చెందిన స్వతంత్ర పరిశీలకులు కూడా ‘అవకతవకల’, బేసబబు ఎన్నికల ఫిర్యాదును వల్లించారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌పై పార్టీల మధ్య అపూర్వమైన ఏకాభిప్రాయం ఇమ్రాన్ ఖాన్‌కు శుభసూచకం కాదు. ఎన్నికల్లో టెర్రరిస్టు హింస చోటు చేసుకుంది. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఆత్మాహుతి బాంబుదాడిలో 31 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.
ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లకు 19 తగ్గాయి. ‘సైన్యం’ సహాయంతో అది సంకీర్ణాన్ని కూర్చుకోగలదు. ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వం కింద పాకిస్తాన్ ఎలా ఉండబోతుంది? అతడు అనేక పొరపాట్లు చేస్తున్న కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో లాగా ఉంటాడా? వ్యక్తిగత జీవితంలో, రాజకీయ దృక్పథంలో అసాధారణంగా కనిపించే ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మక్రాన్‌లాగా ఉంటాడా? మక్రాన్ తనకన్నా 25 ఏళ్లు పెద్దయిన తన టీచర్‌ను వివాహమాడాడు. ఇమ్రాన్‌ఖాన్ తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన జెమిమా గోల్డ్‌స్మిత్‌ను, తర్వాత పాకిస్థాన్ జర్నలిస్టును, ఇటీవల తనకు ఆధ్యాత్మిక సలహాలిచ్చే, ఐదుగురు బిడ్డల తల్లిని వివాహమాడాడు. కొన్ని రాడికల్ లక్షాల ప్రకటనతో ఇమ్రాన్‌ఖాన్ ప్రజాదరణ గల రాజకీయ నాయకునిగా ఆవిర్భవించాడు. సైన్యం ఆధిపత్యంగల రాజకీయాల్లో ఆయన ఏమేరకు వాటిని నెరవేర్చగలరో వేచి చూడాల్సిందే.
పూర్తిగా ఫలితాలు వెల్లడి కానమునుపే ఇమ్రాన్ చేసిన ‘విజయ ప్రసంగం’లో వెలిబుచ్చిన కొన్ని కొత్త చొరవలను చర్చించవచ్చు. దేశంలో ‘ఇస్లామిక్ సంక్షేమ రాజ్య’ నిర్మాణాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అది ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కాని పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం అంచున ఉన్నందున అమలు చేయటం కష్టం. విదేశీ మారక ద్రవ్య నిధులకు తీవ్రమైన కొరతతో అది ఐఎంఎఫ్ నుంచి బెయిల్ ఔట్ కోరుతున్నది. ఉద్యోగాలు, అభివృద్ది పథకాలతో యువతను, వృద్ధులను ఆకర్షించినందున కొన్ని సంక్షేమ పథకాలు అమలుజరపకతప్పదు. అవినీతిని రూపుమాపుతానన్నాడు ఆహ్వానించదగిందే, అయితె ఎంతో సంక్లిష్టమైంది. దక్షిణాసియా దేశాలు పరస్పరం పోట్లాడుకునే బదులు దారిద్య్రంపై పోరాడాలన్నాడు. ఇది చాలా విలువైన దృక్పథం.
భారత పాకిస్థాన్ సంబంధాలపై ఆయన ప్రకటన తాజా గాలిని పీల్చినట్లుంది. సంభాషణల ద్వారా భారత్‌తో సంబంధాలను చక్కదిద్దుకోవటం గూర్చి మాట్లాడుతూ, ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన కశ్మీర్ సమస్యను ఎప్పటివలె ప్రస్తావించాడు. కశ్మీర్‌పట్ల ఆయన కొత్త దృక్పథం ఏమిటి? భారతదేశం ఒక్క అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు ముందుకేస్తామన్నారు. అయితే ఆయన “ఒక్క అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు’ అన్న మావోస్ టుంగ్ ఉవాచలోకి పడిపోవచ్చు. పాకిస్థాన్‌కు ప్రధాన ఉపకారి అయిన అమెరికాతో సాధారణ సంబంధాలను ఆయన కోరుకున్నాడు, అదే సమయంలో కొత్త ఉపకారి చైనాను విడిచిపెట్టాలని కోరుకోవటం లేదు.
ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగం కచ్చితంగా సదుద్దుశాలను ప్రతిబింబించింది. అందులో రాజకీయ కృత్రిమం లేదు. ఏ విధంగా చూచినా, భారత్ మార్పును ఆహ్వానించాలి. రిగ్గింగ్ ఎన్నికల వంటి రాజకీయ ఆరోపణలు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారం. కొత్త ప్రధానిని భారత్ ఆహ్వానించాలి. ఆయన అనూహ్యమైన వ్యక్తి గనుక పాకిస్థాన్ విదేశాంగ విధానంలో ఏదో నాటకీయ పరిణామాన్ని మనం ఆశించవచ్చు. మూసకట్టును బద్దలుకొట్టగలిగిన నాయకులే భారత పాకిస్థాన్‌లకు అత్యంత ఆవశ్యకమైన సంబంధాలను సాధారణీకరించగలరు. పాకిస్థాన్ నౌక కొత్త కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్, గుడ్ లక్! (ఇన్ఫా)

* డాక్టర్ డి.కె. గిరి
(ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జెఎంఐ)