Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బాల్యంపై బడి భారం

In addition to the money they are selling books

స్కూల్ బ్యాగులు మోయలేక పిల్లల అవస్థలు
డబ్బుకోసం అదనంగా పుస్తకాలు అమ్ముతున్న యాజమాన్యాలు
బుక్ స్టాల్ యజమానులే ఏజెంట్లు
జీఓ నెంబర్ 22 అమలు ఎన్నడో

మన తెలంగాణ/మణుగూరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ బడి పిల్లల పుస్తకాల బారం తగ్గించేందుకు 2017 జూలై 19న జీఓ నెంబర్ 22ను జారీ చేసింది. విధ్యాశాఖ అధికారులు దీనిని పటిష్టంగా అమలు పరిచేందుకు గత సంవత్సరం అగస్టు 9న దాని విధివిదానాలను కూడా విడుదల చేశారు. కాని పుస్తకాల బరువు తగ్గించాలని ప్రభుత్యం విడుదల చేసినా జీఓ నెంబర్ 22ను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల విద్యార్ధులు బడి బ్యాగులు మోయలేక నాన అవస్ధలు పడుతున్నారు. విద్యార్థుల వయస్సుకు వారు మోసే పుస్తకాల బరువుకు సంబంధం లేకుండా ఉంది. దీంతో పిల్లలు స్కూల్ బ్యాగుల మోయలేక శారిరకంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. జీవో ప్రకారం మండల పరిధిలోని ప్రాధమిక, ఉన్నత పాఠశాలల ప్రాధానోపాధ్యాయులతో పాటు మండల విధ్యాశాఖ అధికారలతో సమావేశాలు నిర్వహించి, మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి కాని ఇప్పటి వరకు ఆఊసే కనిపించడం లేదు. మండలంలో ఇప్పటివరకు విధ్యాశాఖ అదికారి పాఠశాలలను తనికీ చేసిన సందర్బాలు కనిపించడంలేదు. మండలంలోని కొన్ని స్కూల్స్‌లో అదిక రేట్లకు పుస్తకాలు విక్రయిస్తున్నారు. స్కూల్స్‌లో ఎటువంటి పుస్తకాలు విక్రయించోద్దని ప్రభుత్వం ఆదేశాలు జారిచేసిక మండలంలొని అన్ని స్కూల్స్‌లోనే పుస్తకాలు విక్రయిస్తున్న అధికారులు నిమ్మకు నీరేత్తనట్లు వ్యవహరిస్తున్నారంటే వారి అమ్యామ్యలు వారికి ముట్టి ఉంటాయని పలువురు భహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పట్టణంలోని కొన్ని పాఠశాలల రూటే సపరేటు పట్టణంలోని కోన్ని బుక్ స్టాల్స్‌కు కమీషన్ పధ్దతిలో డబ్బులు చేల్లిస్తు వారు పిక్స్ చేసిన రేట్లకు పుక్తకాలను అమ్ముతున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

జీఓ నెంబర్ 22అమలు ఎన్నడో : మండలంలో జీవో నెంబర్ 22 అమలుకు మోక్షం కలగటంలేదు. ఈ జీవో ప్రకారం స్కూల్ పిల్లల పుస్తకాల బరువు 3,4,5 తరగతుల విధ్యార్ధులకు 2-3 కిలోల వరకు, 6,7 తరగతులకు 4కిలోలు, 8,9 తరగతుల విధ్యార్ధులకు 4.5కేజీలు, 10వ తరగతి విధ్యార్ధులకు 5కేజీలకు మించవద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారి చేసినా విధ్యాశాఖ అధికారుల తనికీలు లేక అవి అమలుకు నోచుకోవడం లేదు. పట్టణంలోని కోన్ని ప్రవేటు పాఠశాలలు పుస్తకాలు, స్టడి మేటిరియల్స్ పేరుతో పిల్లలు మోయలేని బారం మోపుతున్నారు. ఇప్పటికైన విధ్యాశాఖ అధికారులు ప్రవేట్ పాఠశాలలను తనికిచేసి, విధ్యార్ధులపై పుస్తకాల బారం తగ్గించే జీవో నెంబర్ 22ను పకడ్బందిగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.

డోలి శ్రీనివాస్, మండల విధ్యాశాఖదికారి : విద్యార్ధులపై పుస్తకాల భారం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఈ విధ్యాసంవత్సరం ప్రారంభంలోనే దాదాపు 10 పాఠశాలలు తనికీ చేపట్టాం. ప్రవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వారు హేచ్చరించారు. మండలంలో జీవో నెంబర్ 22 అమలుకు పట్టణంలోని కోన్ని ప్రవేటు పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని త్వరలోనే జీవో నెంబర్ 22ను పూర్తి స్ధాయిలో అమలు పరుస్తామని తెలిపారు.

Comments

comments