Home నవ విజ్ఞానం భూమికి మరో రెండు చంద్రులు

భూమికి మరో రెండు చంద్రులు

In addition to the moon, there are two other moons in awe

మనం ఇప్పుడు చూస్తున్న చంద్రుడు ఒక్కడే భూమికి అనుసంధానంగా ఉన్నాడని అనుకుంటున్నాం. కానీ ఈ చంద్రుడు కాక అదనంగా మరో రెండు చంద్రులు ఉన్నారంటే విస్మయం కలుగుతుంది. ఆ రెండు చంద్రులు పూర్తిగా దుమ్ముతో కూడి మన భూగోళం కన్నా పరిమాణంలో తొమ్మిది రెట్లు పెద్దగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి ఉనికిపై గత ఏభై ఏళ్లుగా చర్చ సాగుతోంది. ఇప్పుడు హంగేరీ పరిశోధకులు ఈ మేరకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త కజిమియర్జ్ కోర్డిలూయిస్కీ మొట్టమొదటి సారి 1961లో ఈ దుమ్ము చంద్రుల ఉనికిని కనుగొన గలిగారు. అప్పటి నుంచి ఆ మబ్బులకు కొర్డిలుయిస్కి మబ్బులని పేరు వచ్చింది. భూ కక్షకు 4,00,000 కిలోమీటర్ల దూరంలో వెడల్పులో మన భూగోళం కన్నా తొమ్మిది రెట్లు పెద్దదిగా 1,05,000 72000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. వాటి వైశాల్యం విస్తారంగా ఉన్నప్పటికీ కొర్డిలుయిస్కి మబ్బులు చిన్న ధూళి కణాలతో ఏర్పడి ఉన్నాయి.

ఆ ధూళి కణాలు అసాధారణ అస్పష్ట కాంతిని వెదజల్లుతున్నాయి. ఈ కారణంగా పాలపుంత నక్షత్రాల వెలుగు నుంచి వాడిని విడిగా స్పష్టంగా చూడడం కష్టమవుతోంది. రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీకి చెందిన మంత్లీ నోటీసెస్‌లో ఈ అధ్యయనం మొదట ప్రచురణ అయింది. ఈ దుమ్ము చంద్రుల ఉనికిని నిరూపించడానికి ప్రత్యేకమైన పోలరైజ్డ్ ఫిల్టర్లను కెమెరాకు వినియోగించినట్టు అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. ఆ మబ్బుల్లోని విడివిడి కణాల నుంచి వెలువడుతున్న చెదురుమదురు కాంతిని హంగేరీ శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. ఈ మబ్బులు నిరంతరం తమ సమ్మేళనాన్ని మార్చుతుంటాయని, ధూళి కణాలు తమలో తాము మారిపోతుంటాయని, తెలుసుకున్నారు. ఈ ధూళి కణాలు కొన్ని భూమి, లేదా చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వలన కబళింప బడతాయి. మిగతావి ఉల్కా పాతాల వల్ల ఏర్పడతాయి. ఈ అధ్యయనం లో కనుగొన్న మరో ముఖ్యమైన అంశం ఏమంటే భూమి చుట్టూ ఉన్న లాగ్ రేంజి పాయింట్ల వద్ద ఈ దుమ్ము చంద్రుల ఉనికి ఉండడం గమనార్హం. ఇవి గురుత్వాకర్షణ స్థిర స్థానాలు. కేంద్రకం నుంచి విడిపోవు శక్తులు ఇక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా తులనాత్మక స్థాయిలో ఉంటాయి.
– సైన్స్ విభాగం

In addition to the moon, there are two other moons in awe

Telangana Latest News