Home ఆఫ్ బీట్ చనిపోయినవారిని పెళ్లిచేసుకోవచ్చు

చనిపోయినవారిని పెళ్లిచేసుకోవచ్చు

Wedding

ఫ్రాన్స్‌లో చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమే. ఇది 1959 నుండి అమల్లోకి వచ్చింది. ఒక డ్యామ్ పేలిపోయి 420 మంది చనిపోయారు. ఆ సంఘటనలో తాము ప్రేమించిన వ్యక్తులను కొంతమంది మహిళలు కోల్పోయారు. అయితే చనిపోయిన తమ ప్రియుడిని పెళ్లిచేసుకునే అవకాశం కల్పించమని ఆ యువతులు కోరారు.

అప్పటి నుంచి అది కొనసాగుతోంది. అయితే చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకునేవారు అంతకుముందే వారిని ప్రేమించినట్టు లేదా పెళ్లిచేసుకోవాలనుకున్నట్టు రుజువులు తీసుకురావాలి. ఈ చట్టాన్ని దురుపయోగం చేసి చనిపోయిన వ్యక్తి ఆస్తులకు వారసులుగా అవడానికి మాత్రం కుదరదట.