Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కుటుంబ వ్యాపారాల్లో మూడో స్థానం

In India 111 companies are family businesses

భారత్‌లో 111 కంపెనీలు కుటుంబ వ్యాపారాలే
ఒకటి, రెండు స్థానాల్లో చైనా, అమెరికా
క్రెడిట్ సూస్ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో టాటా, బిర్లా, అంబానీలు అంటే అందరికీ తెలుసు. వీరంతా దిగ్గజ వ్యాపారవేత్తలు.. ఈ కుటుంబాలు వారసత్వంగా బిజినెస్‌లను విజయవంతంగా నడిపిస్తూ వస్తున్నాయి. ఇలా వ్యాపారాలు చేసే సంస్థలు భారత్‌లో అనేకం ఉన్నాయి. ఇదే అంతర్జాతీయంగా మన భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టింది. భారత్‌లో 839 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కల్గిన 111 కంపెనీలు కుటుంబ వ్యాపారాలే ఉన్నాయి. ఈమేరకు ‘2018లో క్రెడిట్ సూస్ ఫ్యామిలీ 1000’ నివేదిక పేర్కొంది. చైనాలో 159 కంపెనీలు, అమెరికాలో 121 కంపెనీలు కుటుంబ వ్యాపారాలు, వీటి తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. నివేదిక ప్రకారం, కుటుంబ వ్యాపారాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా,రెండో స్థానంలో అమెరికా నిలిచింది. అమెరికాలో 121 కంపెనీలను ఆయా వ్యవస్థాపకుల వారసులు కొనసాగిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఎక్కువ కంపెనీలు ఆసియా ప్రాంతానికి చెందినవే ఉన్నాయి. చైనా, భారత్, హాంకాంగ్ ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. ఈ జాబితాలో 43 కంపెనీలతో దక్షిణకొరియా నాలుగో స్థానంలో ఉంది. ఇక 26 కంపెనీలతో ఇండోనేషియా, మలేసి యా,ఫిలిప్పీన్స్,థాయ్‌లాండ్ దేశాలు ఐదో స్థానాన్ని పంచుకున్నా యి. ఇక ఇలాంటి కంపెనీల్లో అత్యధిక లాభం ఆర్జిం చే టాప్ 50లో ఆసియాకు చెందిన 24 సంస్థలు ఉన్నాయి. ఇందులో 12భారత్‌వే కావడం విశేషం. ఈ ఏడాది కుటుంబ వ్యాపారాలు వేగంగా వృద్ధి సాధిస్తున్నాయని క్రెడిట్ సూసీ హెడ్ అనలిస్ట్ ఎగె నే క్లెర్క్ అన్నారు. జపాన్ యేతర ఆసియాలో టాప్ 30 ఉత్తమ కంపెనీల్లో సగం వరకు భారత్‌కు చెం దినవే ఉన్నాయి.

ఆ తర్వాత చైనాలో మూడింట ఒక వంతు ఉన్నాయి. 3 కంపెనీలతో మూ డో స్థానంలో మలేసియా,ఒక్కొక్క కంపెనీతో కొరి యా,ఇండోనేషియా ఉన్నట్టు నివేదిక వివరించింది.

Comments

comments