Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కమాన్‌పూర్‌లో భారీ వర్షం

In Kamanpur, heavy rain is over drowning

పొంగిపొర్లిన డ్రైనేజీలు ఇండ్లలోకి చేరిన నీళ్లు
వారసంతలో కొట్టుకుపోయిన కూరగాయలు

మనతెలంగాణ/కమాన్‌పూర్ : మండలంలోని శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో డ్రైయినేజీలు పొంగిపొర్లాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చిచేరింది. దారుల వెంట వరదలు పారాయి. గంట పాటు ఎడతెరిపిలేకుండా కురిస వర్షంతో జనం ఆతలాకుతలమైనారు. కమాన్‌పూర్ మండలం కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న కల్వర్టు పనులు ఆసంపూర్తిగా చేసి వదిలివేయడంతో ప్రధాన రహదారి వెంట ఉన్న డ్రైయినేజీ పొంగిపొర్లడంతో వరదనీరు ఇండ్లలోకి చేరి ఇంట్లోని వస్తువులు తడిసిపోయాయి. పలుమార్లు గ్రామపంచాయితీ సిబ్బంది. తెలిపిన పట్టించుకొవడం లేదని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కిష్టంపల్లె, గుండారం గ్రామాల్లో డ్రైయినేజీలు ఆస్తవ్యస్తంగా ఉండంతో చిన్నపాటి వర్షం పడితే ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరుతుందని పాలకులు, అధికారులకు తెలిపిన ఎలాంటి చర్యలు తీసుకుకోవడం లేదని పలు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో శుక్రవారం వార సంతలో కూరగాయాలు నీటిలో కోట్టుకుపోయాయి. పేంచికల్‌పేట గ్రామంలో పలు వీధుల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి దారులపై పడిపోయాయి, భారీ వర్షంతో విద్యుత్ సరపరా నిలిచిపోయింది.

Comments

comments