Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

మెదక్ జిల్లాలో కల్తీ కల్లోలం

Person killed

మెదక్: రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బారిన పడిన బాధితుల సంఘటన మరిచిపోక ముందే తాజాగా సోమవారం మెదక్ జిల్లాలో అలాంటి సంఘటనే చోటు చేసుకున్నది. కృత్రిమ మత్తులేని మంచి కల్లు సేవించినప్పటికి మనసుకు పట్టక ఆస్వస్థతకు గురై జోగిపేట పరిధిలోని అందోలు మండలం పోసానిపేట గ్రామంలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో ప్రప్రథమం కావడం గమనార్హం. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే…అందోలు మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గడ్డమీది బాగయ్య (55)కు ప్రతి రోజు కల్లు సేవించే అలవాటున్నది. ఎప్పటి లాగానే సోమవారం ఉదయం కల్లు తాగేందుకు గ్రామంలోని కల్లు దుకాణానికి వెళ్లాడు. కల్లు దుకాణం తెరువకపోవడంతో మనసున (గుత్తి) పట్టక వెను తిరిగి ఇంటికి వెళుతు కల్లు దుకాణానికి పక్కనే గల కల్వర్టుపై ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. కుప్ప కూలిపోయిన వెంటనే చనిపోయినట్టుగా అక్కడి వారు గుర్తించి బాగయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాగయ్య మృతి చెందిన సంఘటన తెలియడంతో అక్కడికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లును పారబోసి, ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కల్లును సరఫరా చేయడం లేదని దీంతో తాము ఆనారోగ్యాల పాలవుతున్నామని వాపోయారు. కల్లులో మత్తు లేని కారణంగా కాళ్లు, చేతులు లాగడం, రాత్రి పూట నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సంఘటనలతో పాటు గాబార కావడం జరుగుతుందని పోసానిపేట గ్రామ ప్రజలు మండిపడ్డారు.

Comments

comments