Home తాజా వార్తలు రియల్ ఎస్టేట్ లో.. పారదర్శకత, జవాబుదారీతనం

రియల్ ఎస్టేట్ లో.. పారదర్శకత, జవాబుదారీతనం

Real Estateఅక్రమాలకు చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వ యోచన
ఓ వైపు డిటిసిపి, మరో వైపు హెచ్‌ఎండిఎ
సిద్ధమవుతోన్న అక్రమ లేఅవుట్ల నివేదిక

అనుమతిలేని లే అవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదు… అంటూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండీఏ) ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తుంది. కానీ, ప్రభుత్వం అందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై దృష్టిసారించింది. గతంలో పురపాలక విభాగం ఉన్నతాధికారులతో సమావేశమైన అథారిటీ అధికారులు సంస్థకు ఆదాయాన్ని పెంచేవిధంగా, ప్రజలకు మేలు చేసేట్టుగా రిజిస్ట్రేషన్ చట్టం వినియోగంలో మార్పులు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టంచేసింది. అలాగే, అంతకుముందు ఉన్నతస్థాయిలో పలుమార్లు జరిగిన సమావేశాల్లోనూ హెచ్‌ఎండీఏ తన పరిధిలోని అక్రమలేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల నిలిపివేత వల్లనే ఇటు రియల్టర్లలో… అటు కొనుగోలుదారుల్లో మార్పును తీసుకురావడం సాధ్యమని గట్టిగా వాధిస్తూ వస్తోంది. అయితే, ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు తనవంతు సహకారాన్ని అందించే దిశగా యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. అథారిటీ పరిధిలో పుట్టగొడుగుల్లా వెలసిన అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడం వల్లనే సంస్థ విస్తరిత ప్రాంతం ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందుతుందని, రవాణా వ్యవస్థ ప్రపంచస్థాయిలో ఉంటుందనే యోచనలో ఉన్నది. రియల్టర్ల ఇష్టారాజ్యానికి చరమగీతం పాడి రియల్ రంగంలో స్పష్టమైన పారదర్శకత, జవాబుదారీ తనంను తీసుకురావాలన్నదే ప్రభుత్వం ప్రధాన యోచన.
రిజిస్ట్రేషన్ యాక్ట్-19తో రిజిస్ట్రేషన్లు నిషేధం…

రాష్ట్ర రిజిస్ట్రేషన్ యాక్ట్-19లోని అండర్ సెక్షన్-2(1)(ఇ) ప్రకారంగా అనుమతిలేని అవుట్లలో రిజిస్ట్రేషన్లను నిషేధించే అధికారము ఆ విభాగానికి ఉన్నది. ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ గత కమిషనర్‌లు ప్రధానంగా శాలినీమిశ్రా, చిరంజీవులు, ప్రస్తుత కమిషనర్ బి. జనార్థన్‌రెడ్డిలు ప్రభుత్వానికి వివరించడం జరిగిందని ప్లానింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలుపరచడానికి సానుకూల సంకేతాలను వెలువరించింది. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని, మనం గౌరవిస్తున్న చట్టాన్ని ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు ప్రయోజనకరంగా అమలు చేయడంపై పలు స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారంగా చర్యలు లేనందునే రియల్టర్‌లు యధేచ్ఛగా భూ వ్యాపారం సాగిస్తున్నారు. ఎకరం నుంచి మొదలుపెడితే వందల ఎకరాల వరకు అక్రమంగా లేఅవుట్లను ఆకర్షణీయంగా ఏర్పాటుచేస్తున్నారు. హెచ్‌ఎండీఏకు ఏటా వందల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇది గ్రహించిన ప్రభుత్వం చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

రిజిస్ట్రేషన్ల నిషేధంతో లాభాలు…

అనుమతిలేని లేఅవుట్లలోని ప్లాట్ల విక్రయాలపై నిషేధం విధిస్తే.. నాలా చట్టం ప్రకారం రుసుంలు చెల్లించడం జరుగుతుంది. ప్రతి లేఅవుట్‌లో ఎకరానికి మార్కెట్ విలువలో 3 శాతం రుసుంల రూపేణా ఆదాయం వస్తుంది. అభివృద్ధి రుసుంలు హెచ్‌ఎండీఏకు చేరుతాయి. అనుమతి ఉన్న లేఅవుట్‌లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు జరగడంతో ఆ విభాగానికి ఆదాయం చేకూరుతుంది. అక్రమలేఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌లు చేయడంతో కేవలం రిజిస్ట్రేషన్‌లతోనే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. నాలా రుసుంలు, అథారిటీ అభివృద్ధి రుసుంలు ప్రభుత్వానికి చేరవు. ప్రజలకు సమస్యలు తలెత్తవు.

అనుమతిలేనివి 1000 లేఅవుట్లు…

హెచ్‌ఎండీఏ పరిధిలో అనుమతిలేకుండా వెలసిన లేఅవుట్లు 1000లుగా ప్లానింగ్ అధికారులు గుర్తించారు. వీటికి ప్లానింగ్‌లో స్పష్టంగా పేర్కొన్న నియమనిబంధనల్లోని ప్రొవిజనల్ ఆర్డర్(పిఓ), కన్ఫర్మేషన్ ఆర్డర్(సిఓ) అనే హెచ్చరికల నోటీసులను అందించినా స్థానిక సంస్థలులు తగిన చర్యలు తీసుకోవడంలో ఉదాసీ నతగా వ్యవహరిస్తు ్తన్నాయి. దీనిని తీవ్రంగా పరిగణిం చిన ప్రస్తుత కమిషనర్ జనార్థన్‌రెడ్డి అనుమతిలేని లేఅవుట్లను గుర్తించి నివేదికను సిద్దంచేస్తున్నారు.

కఠిన చర్యలకు ఉపక్రమిస్తే..

ప్రభుత్వంలోని పెద్దలు, ప్రజాప్ర తినిధులు, ఉన్నతస్థాయి అధికారులు వత్తిడిలు తీసుకొస్తు న్నారని హెచ్‌ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. వందల ఎకరాల్లో అనుమతి లేకుండా లేఅవుట్లు గతంలో పుట్టుకొ చ్చాయి. ఇవి రావడం వల్ల అటు ప్రభుత్వానికి రావాల్సిన నాలా(నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అస్సెస్‌మెంట్ యాక్ట్) రుసుంలు, హెచ్‌ఎండీఏకు చేరాల్సిన అభివృద్ది రుసుంలకు పుల్‌స్టాప్ పడింది. లేఅవుట్ అనుమతిని తీసుకోవాలంటే ముందుగా భూమిని నాలా చట్టం ప్రకారం భూవినియోగ మార్పిడి చేసుకోవాలి. అనంతరం అభివృద్ధి రుసుంలను అథారిటీకి చెల్లించాలి. కానీ, ఈ రెండు రుసుంలను ఎగవేస్తూ, లేఅవుట్ నియమనిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పులు, విధిగా వదలాల్సిన 10 శాతం ఖాళీ ప్రదేశాన్ని, పార్కుకు స్థలాన్ని వదలకుండా ఆ స్థలాన్ని కూడా ప్లాట్లుగాచేసి విక్రయించి రియల్టర్లు ధనవంతులుగా ఎదుగుతున్నారు. హెచ్‌ఎండీఏకు ఆర్థిక నష్టాన్ని కట్టబెడుతున్నారు. దీనిని తీవ్రంగా తీసుకున్న కమిషనర్ వాటికి చరమగీతం పాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి అవరోధం…

అనుమతిలేని లేఅవుట్లు ప్రణాళికాబద్దమైన అభివృద్దికి అవరోధంగా మారుతున్నాయి. భవిష్యత్ ప్రజానికానికి క్రమపద్దతి జీవనానికి ఊతమిచ్చే వెడల్పైన రోడ్లు, నాణ్యమైన డ్రైనేజీ ఏర్పాటు, ఆధునిక జీవవైవిద్యమైన పార్కులు, బహుళ ప్రయోజనాలకు అనుగుణంగా ఖాళీ స్థలాలు ప్రతిలే అవుట్‌లో ఉండాలని చట్టం చేసిన ప్రభుత్వం వాటిని అమలులోకి తీసుకరావడంలేదు. టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా జీఓలు తీసుకొచ్చిన ప్రభుత్వం అనుమతి లేని లేఅవుట్లపై కొరడా ఝలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నది.

హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమలేఅవుట్ల జాబితా ఇది…

రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు- 550, నల్లగొండ జిల్లాలో -120, మహబూబ్‌నగర్ జిల్లాలో- 20, మెదక్ జిల్లాలో- 80, ఘట్‌కేసర్ జోనల్ పరిధి- 50, మేడ్చెల్ జోనల్ పరిధిలో- 120, శంకర్‌పల్లి జోనల్ పరిధిలో సుమారు 110 అక్రమలే అవుట్‌లు ఉన్నట్టు అధికారులు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు. వీరు గుర్తించనివి మరో 500 వరకు ఉంటాయనేది అంచనా. వీటిపై చర్యలు తీసుకోని స్థానిక సంస్థ లపైనా విభాగపరమైన చర్యలు తీసుకునే దిశ గా కమిషనర్ యోచిస్తున్నారు.

కఠినంగా రెరా

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం స్పష్టంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా ఇటు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా)ను అమలులోకి తీసుకువచ్చింది. మరో వైపు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఎ) పరిధిలో అక్రమ లేఅవుట్లను నియంత్రించేందుకు రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకువచ్చేందుకు సన్నా హాలు చేస్తున్నది. ఈ రెండు సంస్థలు సమర్థ వంతంగా పనిచేసేలా ప్రభుత్వం తగు సూచనలు చేస్తున్నది. 500 చ.గ.లకు లోబడి ఉన్న, 8 ఫ్లాట్ల కులోబడి ఉన్న భవన నిర్మాణాలు మినహా యించి జనవరి 1, 2017 తర్వాత అనుమతులు పొందిన ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రెరా చట్టం ప్రకారంగా రెరా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 2018 సెప్టెంబర్ 1నుంచి రెరాలో పథకా లను నమోదు చేసే ప్రక్రియను అమలు చేస్తున్నది. నవంబర్ 30 వరకు 2017(90 రోజులు)లో అనుమతులు పొందిన రియల్ ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేసిన రెరా ఆ గడువు ముగియగానే రూ. 50 వేలు జరిమానాతో మరో 15 రోజులు గడువునిచ్చింది.

అనంతరం రూ. 1.00 లక్ష జరిమానాతో డిసెంబర్ 31 వరకు తుది గడువును పొడిగించింది. ఆ గడువు ముగిసిన తర్వాత రూ. 2 లక్షలు జరిమానాతో జనవరి 15 వరకు ప్రాజెక్టులు రెరాలో నమోదు చేసుకోవాలని హెచ్చరించింది. కానీ, రియల్ ఎస్టేట్ సంస్థలు రెరాలో నమోదుకు అంతగా ముందుకు రావడంలేదు. 2017లో సుమారు 5 వేల రియల్ ఎస్టేట్ పథకాలు పలు అధికారిక సంస్థల నుంచి అనుమతులు పొంది యున్నాయని, అందులో సగం వరకు కూడా పథకాలు రెరాలో నమోదు చేసుకోలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రెరా తన చట్టాన్ని కఠినం గా అమలు చేయాలని భావిస్తున్నది. రాష్ట్రంలో పట్టణా భివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలు, పరుపాలక సంఘా లు, డిటిసిపిలు మంజూరు చేసిన రియల్ ఎస్టేట్ పథకాల జాబి తాను సేకరించి ఆ వివరాల ప్రకారంగా నేరుగా తనిఖీ లు చేసేందుకు ప్రత్యేక బృందాలను తయారు చేస్తున్నది. రెరాలో రిజిస్ట్రేషన్‌లు లేకుండా ప్రచారం చేసుకో వడం, ప్రకటనలు వెలువరించడం, విక్రయాలు చేయడం వంటివి చేయరాదని, అలా జరుగుతుంటే మాత్రం సంబం ధిత ప్రాజెక్టులపై జరిమానా కొరడా ఝలిపించాలని రెరా అధికార యంత్రాంగం సిద్ధ్దమవుతోంది.

In Real Estate Transparency And Accountability