Search
Saturday 22 September 2018
  • :
  • :

ఎస్‌బిఐ బ్యాంకులో చోరికి దొంగల విఫల యత్నం…

chori
మనతెలంగాణ/శామీర్‌పేట : బ్యాంకులో చోరికి యత్నించి విఫలమైన సంఘటన శామీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. శామీర్‌పేట ఇన్స్‌ఫెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం మండల కేంద్రం శామీర్‌పేట ఎస్‌బిఐ బ్యాంకులో ఆర్ధరాత్రి దాటకా గుర్తు తెలియని దొంగలు బ్యాంకు వెనుకాల ఉన్న వెంటిలేటర్‌ను పగుల గొట్టి లోపలికి ఒకరు చోరబడ్డాడు. అంతలోనే బ్యాంకులోని ఆరన్ మోగడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేసరికి దొంగలు పారిపోయారు. సంఘటన స్థలాన్ని పేటబషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు పరిశీలించారు. ఎలాంటి నగదు పోలేదని, అలారం మోగడంతో దొంగలు పారిపోయారని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వేలిముంద్ర పరిశీలకులు రంగంలో దిగి పరిశీలిస్తున్నారు. గతంలో సైతం ఇదే బ్యాంకులో దొంగతనానికి దొంగలు యత్నించి విఫలం అయ్యారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments