Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆనంద నిలయంలో.. అంతా అశాంతే

In surrounding areas smell

కంపుకొడుతున్న పరిసర ప్రాంతాలు
బురుదగా మారిన ప్రాంగణం
పర్యవేక్షణాధికారులు ఎప్పుడు వస్తారో?

మన తెలంగాణ/భద్రాచలం : స్థానిక బస్టాండ్ వెనుక గల ఆనంద నిలయంలో విద్యార్థులు సమస్యలతో సహజీవనం చేస్తూ అశాంతితో కాలం వెళ్లదీస్తున్నారు.  షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ హాస్టల్లో సుమారు 70 మంది వరకు విద్యార్థులు ఎన్‌రోలై ఉన్నారు. కానీ ప్రస్తుతానికి హజరు సంఖ్య 30 దాటలేదు. ఆ హాస్టల్ పరిసర ప్రాంతాలు పూర్తి దుర్గంధాన్ని వెదజల్లుతున్నారు. హాస్టల్ ప్రాంగణం అంతా బురదమయంగా మారిపోయింది. సమస్యలతో విద్యార్థులు సహజీవనం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవ్వరూ పట్టించుకోక పోవడం గమనార్హం. అనాథలుగా ఉండే పిల్లలను చదువులకు దగ్గరచేర్చే క్రమంలో ప్రభుత్వాలు ఆనంద నిలయాలను ఏర్పాటు చేసింది. స్వచ్ఛ భారత్ నినాదంతో దేశం దద్దరిల్లుతుంటే ఇక్కడ మాత్రం అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. విద్యార్థులు నివాసం ఉండే హాస్టల్ పరిసరాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించి అటు, సీజనల్, కీటకజనిత వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కానీ ఇక్కడ అలాంటి పరిస్థితే లేదు. హాస్టల్ ప్రాంగణం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. పరిసర ప్రాం తాల్లో ఉండే చెత్తాచెదారాన్ని కొందరు తీసుకొచ్చి ఆ ప్రాంగణంలో పారవేస్తున్నారు. దీంతో మరింత ఇబ్బందిగా మారింది. కొద్దిపాటి వర్షం పడితే చాలు ప్రాం గణం మొత్తం బురద మడుగులా మారుతోంది. కనీసం లోనికి, బయటకు నడిచేందుకు కూడా అవకాశం లేకుండా బురదతో నిండిపోయింది. విద్యార్థులను పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారి ఎవ్వరూ సాయం త్రం 7 గం.ల వరకు కూడా హాస్టల్ ప్రాంగణానికి రాన ట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు ఆరుబయట ఇష్టం వచ్చినట్లు బురదకు నిలయమైన ప్రాంతంలో ఆడుతున్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్న వేళ విద్యార్థులు ఆటలాడుతుంటే కనీసం మందలించేవారు కూడా లేరంటే వారికి విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోప్రక్క విద్యార్థులు నివాసం ఉండేదుకు పెద్ద భవంతి ఉన్నప్పటికీ కనీసం కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పశువులు లోనికి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆనంద నిలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులు పూర్తి ఆరోగ్యంతో జీవించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments