Home రంగారెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరికి యత్నం

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరికి యత్నం

bank*గోడకు కన్నం వేసిన గుర్తు తెలియని దొంగలు
*ధర్యాప్తు ప్రారంభించిన ఆదిభట్ల పోలీసులు

మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నంః తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గుర్తు తెలియని దొంగలు చోరికి ప్రయత్నించిన సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు పోలీసులు స్థానికులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సోమవారం అర్థ్ర రాత్రి అబ్దుల్లా పూర్ మెట్ మండలం రాగన్న గూడ గ్రామ సమీపంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనుక భాగం నుండి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి బ్యాంకుకు కాపాల ఉన్న వాచ్ మెన్ నాగయ్యను బెదిరించి గడ్డ పారతో గోడకు కన్నం వేసి గదిలోకి వెళ్ళినట్లు తెలిపారు. గదిలో ఉన్న లాకర్ ఓపన్ కాక పోవటంతో దొంగలు వెనుతిరిగినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలియటంతో తక్షణమే పట్నం ఎసిపి మల్లా రెడ్డి హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకోని బ్యాంకు చోరి విఫలయత్నానికి గల కారణాలు పరిశీలించారు. అనంతరం వాచ్ మెన్ నాగయ్యను అదుపులోనికి తిసుకోని విచారించగా దొంగ తనంపై పొత్తన లేని సమాదానం ఇవ్వటంతో అనుమానంతో వాచ్ మెన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ సంఘటన అందరు నూతన సంవత్సర వేడుకలలో ఉన్నప్పుడు సుమారు ముగ్గురు గుర్తు తెలియని దుండగులు చోరికి ప్రయత్నించినట్లు పేర్కోన్నారు. సిసి పూటేజి పరిశీలించి త్వరలో దుండగులను పట్టుకుంటామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ గోవిందా రెడ్డి తెలిపారు.