Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ కు నవరత్నాలు…

టిఆర్‌ఎస్ కు నవరత్నాలు…

 TRS Party

 

9 లోక్‌సభ స్థానాలు కైవసం

ప్రజల తీర్పు శిరోధార్యం : కెటిఆర్

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గుభాళించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు దక్కించుకుంది. మిగతా ఏడు స్థానాలలో గట్టి పోటీ ఇచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయింది. మొత్తం 17 స్థానాలకుగానూ 16 స్థానాలలో పోటీ చేసిన టిఆర్‌ఎస్ పార్టీ 9 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రయెజనాలు కాపాడాలంటే టిఆర్‌ఎస్ అధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది అని టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 17 స్థానాలకు ఒక్క టిఆర్‌ఎస్ పార్టీనే అత్యధికంగా 9 స్థానాలలో విజయం సాధించింది.

మిలిగిన స్థానాలలో హోరాహోరీగా జరిగిన పోటీలో గులాబీ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. స్వల్ప ఓట్ల తేడాతో ఏడు స్థానాలలో టిఆర్‌ఎస్ పార్టీ ఓటమి పాలైంది. మెదక్ పార్లమెంట్ స్థానంలో టిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమర్‌పై 3,15,520 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొమ్మటి సాంబయ్యపై 3,26,266 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తన సమీప ప్రత్యరి బిజెపి అభ్యర్థి డి.కె.అరుణపై 56,404 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఖమ్మం స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక చౌదరిపై 1,66,429 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, మహబూబాబాద్ స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవిత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్‌పై 1,45,100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై 1,89,436 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, చేవెళ్ల స్థానం టిఆర్‌ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై 4,683 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి బిబి పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్ రావుపై 6,228 ఓట్ల మెజార్టీతో గెలువగా, పెద్దపల్లి స్థానం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌పై 94,327 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి విజయం సాధించారు.

బిజెపికి 4…కాంగ్రెస్‌కు 3

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి పార్టీ నాలుగు స్థానాలలో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలలో విజయం సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బిజెపి పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలలో విజయం సాధించింది. అదిలాబాద్ స్థానం నుంచి షోయమ్ బాబురావు టిఆర్‌ఎస్ అభ్యర్థి జి.నగేష్‌పై గెలుపొందారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ టిఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌పై విజయం సాధించగా, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై గెలుపొందారు.

సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై విజయ సాధించారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలలో విజయం సాధించింది. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై విజయం సాధించగా, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై విజయం సాధించారు. మల్కాజిగిరి నుంచి రేవంత్‌రెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిపై గెలుపొందారు.

In the Lok Sabha polls, the TRS Party has boomed.