Home స్కోర్ ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

Third Test, India is in a strong position

కోహ్లి సెంచరీ, రాణించిన పుజారా.. మూడో టెస్టులో భారత్ పైచేయి

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పటిష్టస్థితిలో నిలిచింది. సోమవారం మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ ముందు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలివుండడంతో మ్యాచ్‌లో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు 124/2 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లి, నయా వాల్ చటేశ్వర్ పుజారా అండగా నిలిచారు.

ఇద్దరు ఇం గ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 9 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లి 197 బంతుల్లో పది ఫోర్లతో 103 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో కోహ్లికి ఇది రెండో శతకం కావడం విశేషం. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా మెరుపు ఇ న్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ధాటిగా ఆడి న పాండ్య 52 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రహానె (29) తనవంతు పాత్ర పోషించాడు.