Home ఆదిలాబాద్ పుట్టగోడుగుల్లా బెల్టు షాపులు

పుట్టగోడుగుల్లా బెల్టు షాపులు

In the villages, belt shoppes are Six fruits with tree flowers
నార్నూర్‌: మండలంలో బెల్టు షాపులు పుట్టగోగొడుగుల్లా వెలిశాయి. మద్యం మత్తులో పల్లె యువత ఊగిపోతున్నారు. నార్నూర్ మండలంలోని నాగల్‌కొండ, తాడిహత్నూర్, రాజల్‌గూడ, మలంగి, మాలేపూర్, ఉమ్రి, గాదిగూడ, చోర్‌గావ్, సుంగాపూర్, భీంపూర్, కొత్తపల్లి, మేడిగూడ, కొత్తపల్లి(జి), కోలామ గ్రామాల్లో బెల్టుషాపులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. నిత్యం ఆటోల ద్వారా మద్యాన్ని వైన్స్ షాపునుంచి తరలిస్తున్నారు. బెల్టు షాపువారు ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.30 అదనంగా వసూలు చేస్తూ దర్జాగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మద్యం షాపు నిర్వాహకులు తమ అమ్మకాలు పెంచుకునేందుకు గ్రామాల్లో బెల్టు షాపు నిర్వాహకులకు పూర్తి అండదండగా ఉంటున్నారు. ఎక్సైజ్ పోలీసు అధికారులకు ప్రతినెలా మామూళ్ళు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రోడ్డు మీదే వైన్స్ షాపులు
మేయిన్ రోడ్డుపై వైన్స్ షాపులు ఏర్పాటు చేయ్యకూడదనే నిబందనలు ఉన్న షాపుల యజమానులు పట్టించుకోవడం లేదు. షాపు ముందు వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. మెయిన్ రోడ్డు నుంచి 500 ఫీట్ల దూరంలో వైన్స్ షాపులు ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన కాని యజమానులు అమలు చేయడం లేదని అంటున్నారు. వైన్స్ షాపులకు లైసెన్స్ ఇచ్చే ముందు మేయిన్ రోడ్డు నుంచి తగిన దూరం ఉండాలని పార్కింగ్‌కు సరిపడా స్థలం ఉండే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత అనుమతివ్వాలి కాని సంబంధితా అధికారులు పట్టించుకోవడంలేదన్నా ఆరోపనలు ఉన్నాయి. మద్య సేవించే వారికోసం ఏర్పాటు చేసిన పర్మిట్ రూం పరిశుభ్రత పాటించక దుర్గందం వెదజల్లుతుంది. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.