Home ఆఫ్ బీట్ ప్రకృతిని పంచుదాం..

ప్రకృతిని పంచుదాం..

Beautifull-Photo

మనకు తెలిసిన విషయాన్ని, చూసిన వింతలను పది మందికి పంచితే అదో ఆనందం. సోషల్ మీడియా పుణ్యమా అని ఆ అవకాశం వచ్చేసింది. ప్రకృతి అంటే ఇష్టపడని వారుండరు. జంతుప్రేమికుల కోసం ఏకంగా ఓ యాప్ ఉంది. అదే ఐ నేచురలిస్టు యాప్. ఇదో షేరింగ్ అప్లికేషన్. గమనించాలే కానీ ప్రకృతిని రీసెర్చ్ చేయడానికి జీవితకాలం సరిపోదు. అందుకు సైంటిస్టులే కావాల్సిన అవసరం లేదు. సామాన్యులు కూడా చేసేయొచ్చు.

అలాంటివారి కోసమే ఈ యాప్..  ఐ నేచురలిస్టు ఇది ప్రకృతి ప్రేమికుల కోసం పుట్టిన యాప్,వెబ్‌సైట్. మన ఇంట్లో మొక్కల దగ్గర కనిపించిన సీతాకోక చిలుక , పిచ్చుకలు, ఉడుతల దగ్గర నుంచి అడవిలోని జంతువుల వరకు చెట్టూ పుట్టా పిట్టా అనే తేడా లేకుండా అన్నింటినీ ఫొటో తీసి ఈ యాప్ ద్వారా ఇతరులకు షేర్ చేయవచ్చు. అంతేకాకుండా చూసిన వాటి గురించి ఇతరులను అడిగి తెలుసుకోవచ్చు కూడా.

యాప్‌కు గుర్తింపు ఎలా వచ్చిందంటే… ముంబయి నివాసి అశుతోషి షిండే జంతుప్రేమికుడు. దట్టమైన అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీస్తుంటాడు. ఓసారి అలా ఓ గొల్లభామ ఫొటో క్లిక్‌మనిపించాడు. దాన్ని ఐ నేచురలిస్ట్‌లో పోస్ట్ చేశాడు. దాన్ని వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు చూశారు. అమెరికా, న్యూజిలాండ్‌కు చెందిన సైంటిస్టులు స్పందించారు. ఫ్లవర్ మాంటిస్ అని అధికారికంగా ప్రకటించారు. సరదాగా తీసి ఆ ఫొటోపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగిందంటే కారణం ఐ నేచురలిస్ట్ యాప్ వల్లే. రోజూ ఆ యాప్‌లో అందమైనవి, అరుదైనవి వందలకొద్దీ ఫొటోలు అప్‌లోడ్ అవుతుంటాయి.

ఇదో సిటిజన్ సైన్స్…

ఐనేచురలిస్టు యాప్‌ను వాడడం చాలా సులువు. రిసెర్చ్ క్యాజ్‌వల్ గ్రూపులో ఆప్‌లోడ్ చేస్తే . అది కేవలం చూడటానికే అని అర్థం ఇస్తుంది. గ్రూపులో అప్‌లోడు చేస్తే మాత్రం దానిపై పరిశోధన కోరుతున్నట్టు . ఐ నేచురలిస్ట్ బృందంలోని శాస్త్రవేత్తలు ఆ ఫొటోలోని మొక్క లేదా జీవి గురించి అనేక వివరాలు అందిస్తారు. ఒక్కోసారి అది ప్రపంచానికే సరికొత్త జీవిగా పరిచయం కావచ్చు. ఆ క్రెడిట్ మొత్తం మీకే దక్కుతుంది. అయితే ఆ జీవిని మీరు ఎప్పుడు ఎక్కడ చూశారు. అనే విషయాలను పొందుపరచాలి. మొత్తంగా ఇదో సిటిజన్ సైన్స్ ఒక ప్రాంతంలోని పరిసరాల గురించి అకడి మొక్కల గురించి పరిసరాల గురించి విశ్వవిద్యాలయాల ఆవరణలో కూర్చోని పనిచేసుకునే శాస్త్రవేత్తతో పోలిస్తే స్థానికుడికే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుందన్న సూత్రం మీద పనిచేస్తుంది.

ప్రాజెక్ట్ వర్క్…

ఐ నేచురలిస్టు వెబ్‌సైట్ 2008 లో రూపొందించింది. దీని కెన్ ఇచి అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి మొదలు పెట్టాడు. కాలిఫోర్నియా యూనివర్సిటిలో చివరి ఏడాది చదువుతున్నప్పుడు ప్రాజెక్ట్ వర్కుగా ఈ వెబ్‌సైట్‌ను అరంభించాడు. మొదట్లో పెద్దగా విజయవంతం కాలేదు. 2011లో కెన్ ఇచి తన సేహితుడు లోరీతో కలిసి దాన్నే ఐనేచురలిస్టుగా మారాడు. అప్పట్నించి అనూహ్యంగా స్పందన పెరిగింది. దేశదేశాల్లోని జంతు ప్రేమికులకూ, శాస్త్రవేత్తలకు చేరింది. ఈ బృందంలో 4 లక్షల 50వేల మంది సభ్యులున్నారు.  ఇప్పటివరకూ 60 లక్షల ఫొటోలు అప్‌లోడ్ అయ్యాయి. అందులో లక్షా తొమ్మిది వేల రకాల జీవుల ఫొటోలున్నాయి. మనదేశం నుంచి కూడా వేయిమంది నేచురలిస్టులు ఉన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐ నేచురలిస్ట్ ఐక్యరాజ్య సమితితో కూడా కలిసి పనిచేసిన చరిత్ర ఉంది.