Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

2025 నాటికి ఆదాయం రెట్టింపు

mukesh

రిటైల్, టెలికామ్ సంస్థలతో వేగవంతమైన వృద్ధి
హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్, జియో ఫోన్2 ఆవిష్కరణ
41వ వార్షికోత్సవ సమావేశంలో ప్రకటించిన ముఖేష్ అంబానీ

ముంబై: టెలికామ్ రంగంలో పెనుమార్పులు తీసుకొస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం హైస్పీడ్ జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, జియో ఫోన్2లను ఆవిష్కరించింది. అలాగే జియో డిజిటల్ టివి సర్వీసెస్(జియో గిగాటివి సెట్ టాప్ బాక్స్)ను ప్రవేశపెట్టింది. ముంబైలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండి ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిటైల్, టెలికామ్ సంస్థల వేగవంతమైన వృద్ధితో 2025 సంవత్సరం నాటికి రిలయన్స్ ఇం డస్ట్రీస్ ఆదాయం రెట్టింపు కానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల రిలయన్స్ 201718లో కం పెనీ ఆదాయంగా రూ.4,30,731 కోట్లు, పిఎటి(పన్ను అనంతరం లాభం) రూ.36,075 కోట్లు ప్రకటించింది. కాగా ఫైబర్ ఆధారిత ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ‘జియోగిగాఫైబర్’ను ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీలు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. జియోగిగాఫైబర్ ద్వారా అందించే ఫీచర్లను వారు వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఆగస్టు 15 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని ముఖేష్ అంబానీ చెప్పారు. సెటాప్‌బాక్స్ ద్వారా టివిలో కూడా జియోగిగాఫైబర్ సేవలను అందించనున్నట్టు ఆకాశ్, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్‌లో జియోటివి కాలింగ్ ఫీచర్‌ను కూడా ఉంటుందని తెలిపారు. జియోగిగాఫైబర్ రెండు ముఖ్యమైన ఫీచర్లు స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, టివి కాలింగ్‌లు అని తెలిపారు. జియో.కామ్ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్’ సర్వీసులను రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ పేర్కొంది. జియోఫోన్ 2ను కూడా ఆకాశ్, ఇషాలు ప్రవేశపెట్టారు. జియో ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా మూడు ముఖ్యమైన యాప్స్ యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లను అందిస్తున్నామని తెలిపారు. జియో ఫోన్‌లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా వివరించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు, పెద్ద వ్యాపారాలకు ఫైబర్ కనెక్టివిటీని విస్తరించనున్నామని అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్‌ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ -5 బ్రాడ్‌బ్యాండ్ దేశాల్లో భారత్‌ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఆసక్తి కల్గినవారు ఆగస్టు 15 నుంచి జియో గిగాఫైబర్ కోసం జియో వెబ్‌పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ప్రాంతాల్లో తొలి బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు.

Comments

comments