Home ఆదిలాబాద్ వేతనాలు, వ్యవసాయ భూమిపై వచ్చే ఆదాయం క్రీమీలేయర్ మొత్తంలోకి జమకాదు

వేతనాలు, వ్యవసాయ భూమిపై వచ్చే ఆదాయం క్రీమీలేయర్ మొత్తంలోకి జమకాదు

creamy-layerమనతెలంగాణ/నిజామాబాద్‌ప్రతినిధి:  వేతనాల రూ పంలో వచ్చే ఆదాయం, వ్యవసాయ భూమిపై వచ్చే ఆ దాయం క్రీమీలేయర్ మొత్తంలోకి జమకాదని బిసి సం క్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ స్పష్టం చేశారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రిమిలేయర్ వి ధి విధానం గురించి జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తూ తెలం గాణ రాష్ట్రంలో  ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నేపథ్యం లో అల్పదాయ వర్గాలకు నష్టం వాటిల్లకుండా ఉండాల నే ఉద్దేశ్యం అని తెలిపారు. టిఎస్‌పిఎస్సీ ద్వారా వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకునే బిసిలు అందరూ రెవెన్యూ డివిజినల్ అధికారులచే, తహసీ ల్దార్లచే జారీ చేసిన క్రీమిలేయర్ సర్టిఫికెట్‌ను సమర్పిం చాల్సి ఉంటుందని తెలిపారు. వేతనాలు, వ్యవసాయం కాకుండా ఇతర మార్గాల ద్వారా 6లక్షల వార్షిక ఆదా యం ఉంటే వారు క్రీమీలేయర్ సర్టిఫికెట్ జత చే యాలి, అంతకన్నా తక్కువ ఉన్న వారు నాన్ క్రీమీ లే యర్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ప్రైవేట్ రంగ సంస్థల లో పనిచేస్తున్న వారు, రైతులు నాన్ క్రీమీలేయర్ ్ర కిం దకే వస్తారని అన్నారు. కొంత మంది వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కన్‌స్ట్రక్షన్ కంపెని అధినేతలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారని వివరించారు. ఆదా య ధ్రువీకరణ పత్రాల కొరకు దరఖాస్తు చేసినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం క్రీమీ లేయర్ సర్టిఫికెట్‌ను జారీ చేయాల్సి ఉంటుందని, కు లం, స్థానికత, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో పాటు ఇక నుండి క్రీమీలేయర్ సర్టిఫికెట్ తప్పనిసరి అని తెలిపారు. అభ్యర్థులు క్రిమిలేయర్ సర్టిఫికెట్‌కై దర ఖాస్తు చేసుకోవడానికి ఫారం 7ఎ వినియోగిస్తే ఫారం 7బిపై తహసీల్దార్లు, అంతకంటే పైస్థాయి అధికారులు క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఇస్తారని వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 7ఎ ఫారంతో అభ్యర్థులు దర ఖాస్తు చేసుకున్నచో తహసీల్దార్ లేదా పైస్థాయి అధి కారులు క్రీమీలేయర్ 7బి సర్టిఫికెట్‌ను క్రీమీలేయర్ లే ని వారికి 7సి సర్టిఫికెట్‌ను ఇస్తే బాగుంటుందని తెలపగా రేమండ్ పీటర్ సరే అని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, అద నపు జెసి రాజారాం, డిఆర్‌ఓ మోహన్‌లాల్, బిసి వెల్ఫే ర్ అధికారిణి విమాలాదేవి తదితరులు పాల్గొన్నారు.