Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సౌదీఅరేబియాలో ఆదాయపు పన్ను ఎత్తివేత

SAUDI

దోహా : మనం ఏ వస్తువు కొన్నా పన్నుకట్టాల్సిందే. మన ఆదాయానికి కూడా పన్ను చెల్లించాల్సిందే. కానీ ఇకపై సౌదీ అరేబియాలో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. పన్నుల విషయంలో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ పౌరులు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆ దేశ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ప్రజలే కాదు సౌదీ కంపెనీలు కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇటీవల చేపట్టిన ఆర్థిక సంస్కరణల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి సౌదీలో ఆయిల్ ధరలు పతనమవడంతో అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ లాంటి మార్పులు, చేర్పులు చేపట్టింది. వ్యాట్‌పై కూడా ప్రజలకు ఉపశమనం కలిగించింది. 2020 సంవత్సరం వరకు వ్యాల్యూ ఆడెడ్ ట్యాక్స్‌ను ఐదు శాతం కంటే ఎక్కువగా పెంచబోమని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

comments