Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నగదు జరీమానా!

3 లక్షలకు మించి నగదు తీసుకునే వారికి 100% ఫైన్

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కఠిన నిబంధన : రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా వెల్లడి

Taxన్యూఢిల్లీ: నల్లధనం సృష్టిని నివారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి జరిపే లావాదేవీల సందర్భంగా రూ. 3 లక్షలకు మించి నగదు తీసుకున్నట్లయితే భారీఎత్తున జరిమానా విధి స్తారు. నగదు ఇచ్చిన వారు కాకుండా తీసుకున్నవారు జరి మానా చెల్లించాలి. లావాదేవీల సందర్భంగా రూ. 3 లక్షల కు మించి నగదు తీసుకోరాదని కొత్త బడ్జెట్‌లో ప్రతిపాదిం చారు. అంతకు మించి నగదు తీసుకునే వారు తాము తీసు కునే నగదుకు సమానంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుం దని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ‘ఉదాహరణకు మీరు ఏదై నా లావాదేవీ సందర్భంగా నాలుగు లక్షల నగదు తీసు కుంటే చెల్లించవలసిన జరిమానా రూ.4 లక్షలు. 50 లక్షలు తీసుకుంటే జరిమానా రూ.50 లక్షలని’ ఆయన తెలిపారు. అంటే ఎవరైనా ఖరీదైన వాచీ కొంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకునే దుకాణదారు పన్ను చెల్లించాలి. ఎక్కువ మొత్తం నగదు ఇచ్చి లావాదేవీలు జరపడం మాన్పించేందుకు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. పెద్ద మొత్తంలో లెక్కకురాని సొమ్ము ఉన్న వారు సాధారణంగా విలాసాలకు, విహార యాత్రలకు , కార్లు, ఖరీదైన వాచీలు కొనేందుకు ఖర్చుచేస్తారు. పరిమితులు, జరిమానాలు విధించడం ద్వారా ఆ విధమైన ఖర్చుచేయడాన్ని నివారించాలని భావిస్తున్నారు. రెండు లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపినప్పుడు విధిగా పాన్ నెంబరు రాయాలన్న నిబంధన కొనసాగుతోంది. నగదు లావాదేవీల పరిమితి ప్రభుత్వానికి, బ్యాంకింగ్ కంపెనీకి, పోస్టాఫీసు సేవింగ్ బ్యాంక్‌కు , సహకార బ్యాంక్‌కు వర్తించదు.

Comments

comments