Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పెట్టుబడులు పెంచండి

Pm-Modi-Meetingదక్షిణ కొరియా సిఇఒలతో మోడీ

న్యూఢిల్లీ : భారత్‌లో పెట్టుబడులను మరింత పెంచాలని దక్షిణ కొరియా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్ర మంలో  భాగంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనేక దేశాలు ఆసక్తిని చూపుతున్నాయ ని అన్నారు. ఇండో-కొరియా సదస్సుకు ఇరు దేశాలకు చెందిన కంపెనీలు సిఇఒలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇ రు దేశాల మధ్య వ్యాపార సహకారం మరింత పెరగడానికి కావాల్సిన అంశా లపై మోడీ చర్చలు జరిపారు. కొరియన్ పరిశ్రమ నైతికత, నైపుణ్యాన్ని ప్రధాని ప్రశంసించారు. భారత్‌లో కొరియన్ బ్రా ండ్‌లు అంతటా వ్యాపించాయని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడు దల చేసింది. భారత్‌లో కొరియన్ కంపె నీలు పెట్టుబడులు మరింతగా పెంచాల ని ప్రధాని అన్నారు. 17 బిలి యన్ డాల ర్లకు పైగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు జరగ్గా, కొరియా కు భారత్ 15వ అతిపెద్ద వాణిజ్య భా గస్వామిగా ఉంది. హుందయ్ మోటా ర్స్, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎల్ వంటి కంపెనీలు భారత్‌లో అంతటా వ్యాపించి ఉన్న విషయం తెలిసిందే.

Comments

comments