Home బిజినెస్ పశ్చిమ బెంగాల్‌లో పెరిగిన మొండి బకాయిలు

పశ్చిమ బెంగాల్‌లో పెరిగిన మొండి బకాయిలు

SBI

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో ఎంఎస్‌ఎంఇ(సూ క్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) రంగంలో ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) పెరిగాయంటూ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. వీటి కోసం బ్యాంక్ కొత్త అంచనా వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. బెంగాల్‌లో పేరుకుపోయిన మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్‌బిఐ సిజిఎం(బెంగాల్ సర్కిల్) పార్థో ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు. ఇక్కడ ఎంఎస్‌ఎంఇపై ఐసిసి నిర్వహించిన సదస్సులో సేన్‌గుప్తా మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టీలు ఆధారిత కంపెనీల్లో ఎన్‌పిఎలు పెరిగాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఇ కోసం కొత్త అంచనా వ్యవస్థను ఆగస్టు 5వ తేదీన ఎస్‌బిఐ ప్రవేశపెట్టిందని తెలిపారు. కొత్త వ్యవస్థ కింద ఎంఎస్‌ఎంఇలకు రూ.50 లక్షలు, అంతకు మించి రుణా ల అవసరం ఉంటే బ్యాలెన్స్ షీట్‌తో పాటు ద్రవ్యలభ్యతను ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. కొ న్ని ప్రశ్నలు, బ్యాంక్ స్టేట్‌మెంట్ ఆధారంగా సులభతర ఆర్థిక విధానం తీసుకొచ్చామని ఈ సంద ర్భఃగా ఆయన వివరించారు.