Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రచార వేగం పెంచండి

 టిఆర్‌ఎస్ అభ్యర్థులపై కెసిఆర్ నజర్
 నిఘా వర్గాల నుంచి సమాచార సేకరణ
 ఇంకా ప్రచారం మొదలుపెట్టని వారిపై ఆరా
KCR

 హైదరాబాద్ : అభ్యర్ధుల ప్రచారంపై టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ నజర్ పెట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టిఆర్‌ఎస్ అభ్యర్ధు లు ప్రచారంలో దూసుకపోవాలని ఆదేశించారు. ప్ర చారాన్ని చూసి ప్రతిపక్షాలకు వణుకుపుట్టాలన్నారు. వివిధ కారణాలతో పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రచారాన్ని వేగం చేయాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించినా ప్రచారం పట్ల అలసత్వం చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. స్థానిక నేతల మధ్య సమన్వ యం లోపం కూడా ఒక కారణమని గమనించి వారికి పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేసినట్లు సమాచారం. పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన వారి మధ్య పోటీ ఉన్నప్పటికీ టిక్కెట్లు ఆశించిన భంగపడిన నేతలను కలుపుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. నాలుగున్నర సంవత్సరాల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పెద్దఎత్తున వివరించాలని అభ్యర్ధులకు సూచించారు. ప్రతిపక్షాలు అభ్యర్ధుల జాబితాను ప్రకటించే సమయానికే నియోజకవర్గాల్లో కనీసం రెండు, మూడు దఫాల ప్రచారాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇం దుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెం ట నే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకపోవాలని, అప్పటి సమస్య పరిష్కారం కాని పక్షంలో నేరు గా తన దృష్టికే తీసుకరావాలని స్పష్టం చేశా రు. అధినేత నుంచి ఇంత స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్ధులు ప్రచార వేగాన్ని ఆశించినంతగా పెంచలేకపోతున్నారు. జిల్లాల వారిగా పార్టీ అభ్యర్ధులు చేస్తున్న ప్రచారాన్ని మంత్రులు ద్వారా కూడా సమాచారాన్ని కెసిఆర్ సేకరిస్తున్నారు.

Comments

comments