Home సిద్దిపేట ‘డబుల్’ పనుల వేగం పెంచండి

‘డబుల్’ పనుల వేగం పెంచండి

Harish-rao-image

పట్టణంలో 2500 డబుల్ బెడ్‌రూంల నిర్మాణం

మనతెలంగాణ/సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని నర్సాపూర్ వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూంలు కేటాయిస్తామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్న కాలనీ వద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం స్థల సేకరణ చేపట్టి పనులను వేగవంతం చేయాలన్నారు. పట్టణంలో 2500 డబుల్ బెడ్‌రూంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, పంచాయతీ రాజ్ శాఖ అధికారి వేణుగోపాల్, తహసీల్దార్ పరమేశం, నాయకులు కొండం సంపత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.