Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

నా పేరు కోడి.. నేనిప్పుడు వేడి

Increase the Chicken Rates This Summer

మన తెలంగాణ/డోర్నకల్: కోడిమాంసం కుతకుతలాడుతోంది. మండుతున్న ఎండలతో పోటీపడి కోడి ధర కొండెక్కి కూర్చుంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్ల ఫామ్‌లలో వేలాది కోళ్లు మృతి చెందుతున్నాయని ఫౌల్ట్రిఫాం యజమానులు తెలుపుతుండగా, పెళ్లిల సీజన్ కాబటి చికెన్ డిమాండ్ పెరుగుతుండటంతో ఫౌల్ట్రి యజమానులు సిండికేటై ప్రతి ఏడాది చికెన్ ధరలు పెంచుతున్నారని ప్రజలు వాదిస్తున్నారు. దీంతో చికెన్ ప్రియులు పెరిగిన ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో చికెన్ ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కాగా ఆదివారం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.220 పలుకగా, డ్రెస్‌డ్ చికెన్ కిలో రూ.180కి విక్రయించారు. ఇటీవలి కాలంలో చికెన్ ధర ఇంత పెరగడం ఇదే ప్రథమమని మాంస ప్రియులు చెబుతున్నారు.సాధారణంగా మార్కెట్‌లో మేక మాంసం ధర కిలో రూ.400లు పలుకుతోంది.దీంతో మధ్య తరగతి,నిరుపేదలు చాలా వరకు తక్కువ ధరలో ఉండే చికెన్ కొనుగోలు చేస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చికెన్ షాపులన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. కానీ ఈ ఆదివారం పెరిగిన చికెన్ ధరలతో దుకాణాలు వెలవెలబోయాయి.

Comments

comments