Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో నిత్యావసర వస్తువులకు రెక్కలు

Increase the Vegtable Price In Telangana

మన తెలంగాణ/హుస్నాబాద్ రూరల్ : పెరిగిన పెట్రోల్, డీజిల్  ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్నాబాద్ పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.31 పైసలు, డీజిల్ 74.34 రూపాయలు విక్రయించడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో వాహన దారులు పెట్రోల్ పోయించుకుని తిరగ లేని పరిస్థితి నెలకొంది . మారుతున్న కాల పరిస్థితులు జనజీవనంలో వేగానికి అనుగుణంగా పేద కుటుంబాలు సైతం మోటరు సైకిళ్లను రవాణా సదుపాయంగా ఉపయోగిస్తున్నారు. కమ్యూనికేషన్ విభాగంలో సెల్ ఫోన్ ఎంత విస్తృతమైందో మోటర్ సైకిల్ వాడకం కూడా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంది. ఉన్నత కుటుంబాలతో పాటు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా వాహనాలు వాడుతున్నారు. వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించడంతో వాహనాలు కొనే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఇదిలా ఉండగా రోజు వారిగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి ప్రజలు వాహనాల మీద తిరగలేని పరిస్థితి నెల కొంటోంది. పెరిగిన ఇంధన ధరలతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొని తినలేక అవస్థలు పడుతున్నారు. పెట్రోలియం ధరలు పెరుగుతున్నా పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పైన సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెరిగిన ధరలను తగ్గించాలని కొంత మంది వాహనదారులు  కోరుతున్నారు.

Comments

comments