Home తాజా వార్తలు ఆ కార్మికుల గౌరవ వేతనం పెంచాలి: కవిత

ఆ కార్మికుల గౌరవ వేతనం పెంచాలి: కవిత

Kavitha

ఢిల్లీ: మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనం పెంచాలని కేంద్రాన్ని కోరామని ఎంపి కవిత వెల్లడించారు. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ఎంపి కవిత నేతృత్వంలో టిఆర్‌ఎస్ ఎంపిలు కలిశారు. ఎంపిలతో పాటు ప్రకాశ్ జావదేకర్‌ను మధ్యాహ్న భోజన పథక కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి కార్మికులకు వెయ్యి రూపాయలు మాత్రమే వస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు. కేంద్ర కార్మిక చట్టాల ప్రకారం ఇపిఎస్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతన కార్మికులుగా వంట చేసేవారిని కూడా గుర్తించాలన్నారు.