Search
Wednesday 21 November 2018
  • :
  • :

బతుకుకు.. భరోసా

Increased belief to government medicine

ప్రభుత్వ వైద్యంపట్ల పెరిగిన నమ్మకం
కెసిఆర్ నిర్ణయంతో కిడ్నీరోగుల కష్టాలు ఇక దూరం
డయాలసిస్ కేంద్రం ప్రారంభంతో కిడ్నీరోగులకు బతుకుపై భరోసా
ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి వనపర్తి జిల్లా ఆసుపత్రికి క్యూ కట్టిన కిడ్నీరోగులు

మన తెలంగాణ/వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు రూ. వేలకోట్లను ఖర్చు చేస్తు పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందించడం పట్ల ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం
పెరిగింది. ప్రతిజిల్లా కేంద్రంలో కిడ్నీ రోగుల కోసం సిఎం కెసిఆర్ అత్యాధునిక సదుపాయాలతో కూడిన యంత్రాలను ఇతర దేశాల నుండి తెప్పించి డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కిడ్నీ రోగుల కష్టాలు దూరమై బ్రతుకు పట్ల వారికి భరోసా ఏర్పడింది. గతంలో కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడిన రోగులు వారం లో రెండు రోజులు తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకునేవారు నెలలో కనీసం ఎనిమిది పర్యా యాలు డయాలసిస్ చేయించుకుంటే కనీసం నెలకు రూ. 20వేల దాకా ఖర్చు అయ్యేది. దీంతో ఆర్థికంగాపూర్తిగా చితికిపోతూ ఆస్తులను సహితం అమ్ముకొని వైద్యానికి ఖర్చు చేసుకునే పరిస్థితి ఉండేది. కెసిఆర్ నిర్ణయంతో వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కిడ్నీ రోగులకష్టాలు దూరమయ్యాయి. ముఖ్యమంత్రి గొప్ప మనస్సుతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం కిడ్నీ రోగుల పాలిట వరంలా మారింది. వనపర్తి జిల్లా పరిధిలోనే కాకుండా ఉమ్మడి పాలమూర్ జిల్లా నుండి రోజుకు 45 నుండి 50 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్యులు రక్తాన్ని శుద్ధి చేసి కృతిమంగా రక్తాన్నివడ పోస్తారు.

మొదటి దశలోనే గుర్తిస్తే వైద్యం నయం: కిడ్నీ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే కొంత మేరకు నయం చేసుకోవచ్చు .కాని ప్రజల్లో ఈ వ్యాధిపైన ఎక్కువ అవగాహన లేకపోవడంతో పూర్తిగా కిడ్నీలు పాడయ్యేవరకు గుర్తించలేకపోతున్నారు. కిడ్నీలు పని చేయని వారికి కృత్రిమంగా వడపోస్తారు. దాన్నే డయాలసిస్ అంటారు. ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యం మధ్య తరగతి వారికి మధ్య తరగతి వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయేది. వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది కిడ్నీరోగులు చనిపోతున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలనేఉద్దే శ్యం తోనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రానికి ఒక యూనిట్‌ను మంజూరు చేసింది. ఫ్లోరైడ్ నీరు, డయా బటిస్, హైబిపితో చాలా మంది ఈ వ్యాధికి గురౌతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుంది. మధ్య వయస్సు నుండి మొదలుకొని ముసలివాళ్ల వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో అందుబాటులో డయాలసిస్ కేంద్రం లేకపోవడం వల్ల పల్లెటూర్ నుండి హైద్రాబాద్, మహబూబ్‌నగర్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకునేవారు. డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి రావడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ అవకాశం ఎంతో ఊరట నిచ్చింది. సింగిల్ యూజ్ డైలేజర్‌తో జీవన ప్రమాణం పెరుగుతుంది: 10 పడకలతో కొనసాగే డయాలసిస్ యూనిట్‌లో ఒక్కరోజులో 40 నుండి 50 మందికి డయాలసిస్ చేసేందుకు వీలుంటుంది. అంతేకాకుండా అత్యంత ఆధునికమైన పద్దతిలో డయాలసిస్ కొనసాగుతుంది. సింగిల్ యూజ్ డైలేజర్ విధానం ఉండడం దీని ప్రత్యేకత. సాధారణంగా ఒకపేషంట్‌కు డయాలసిస్ చేయాలంటే డైలేజర్ (కృత్రిమకిడ్నీ) ద్వారా రక్తాన్ని శుద్ది చేస్తారు. అయితే రక్తాన్ని శుద్ది చేసేందుకు ఈ డైలేజర్‌ను ఒక్క రోజుకు 5 నుండి 10 సార్లు ఉపయోగిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసిన యూనిట్‌లో ఒకసారి ఉపయోగించిన డైలేజర్‌ను తిరిగి ఉపయోగించడంతో రక్తశుద్ది బాగా జరుగడమే కాక ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఉండి రోగి జీవన ప్రమాణం పెరుగుతుంది. ఆధునిక మైన డయాలసిస్ యూనిట్ల నిర్మాణం చేపట్టడంపై కిడ్నీ రోగులు ప్రభుత్వ పని తీరును అభినందిస్తున్నారు. గత ఏడాది నవంబర్ 21న

వైద్యఆరోగ్యశాఖామంత్రిచే ప్రారంభం: సీనియర్ టెక్నీషియన్ బాలకృష్ణ.. గత ఏడాది నవంబర్ 21న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డా. లకా్ష్మరెడ్డి,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా వనపర్తి జిల్లా కేంద్రంలో డయాలసిస్ యూనిట్‌నుప్రారంభించినట్లు యూనిట్ ఇంచార్జి బాలకృష్ణ తెలిపారు. 46 మంది వ్యాధిగ్రస్తులకు వారంలో మూడు సార్లు డయాలసిస్ చేయడం జరు గుతుందని ప్రతి రోజు ఉదయం 6.30 నుండి రాత్రి 1.00 గంట వరకు వైద్యసేవలు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కెసిఆర్‌కు రుణపడి ఉంటాం: రామన్‌గౌడ్ డయాలసిస్ వ్యాధి గ్రస్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా నెలకు రూ. 2,500 పెన్షన్‌తో పాటు ఉచిత బస్‌పాస్ , వైద్యం కోసం వచ్చే వ్యాధిగ్రస్తులకు మధ్యాహ్న భోజనసౌకర్యం కల్పించాలని డయాలసిస్ రోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డయాలసిస్ బారిన పడితే తమకు చావే దిక్కన్న ఆలోచనలో ఉన్న మా కోసం సిఎం కెసిఆర్ డయాలసిస్ యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడంతో కెసిఆర్‌కు రుణపడి ఉంటామని కిడ్నీ వ్యాధిగ్రస్తుడు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జంగమాయ పల్లి గ్రామానికి చెందిన రామన్‌గౌడ్ తెలిపారు.

Comments

comments