Home అంతర్జాతీయ వార్తలు పెరిగిన బొగ్గుపులుసు వాయువు

పెరిగిన బొగ్గుపులుసు వాయువు

CARBONవాషింగ్టన్ : వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి గతేడాది విపరీతంగా పెరిగిందని సైంటిస్టులు తెలిపారు. 2015లో వాతావరణ బొగ్గుపులుసు వాయువు 3.05పీపీఎం(పార్ట్ ఫర్ మిలియన్) మేర పెరిగిందని, గత 56 ఏళ్లలో ఇంత అధికాస్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొట్టమొదటిసారి అని అమెరికాలోని జాతీయ సముద్ర , వాతావురణ నిర్వహణ సంస్థ వెల్లడించింది. పారిశ్రామిక విప్లవం రాక ముందు, 1800 సంవత్సరం క్రితం వాతావరణ బొగ్గుపులుసు వాయువు సగటున 280 పీపీఎం ఉండగా, 2016 ఫిబ్రవరిలో 402.59 పీపీఎం ఉందని, ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. గతేడాదిలో అమాంతంగా వచ్చిన పెరుగుదలకు ఎల్ నినో కూడా తోడైందని పరిశోధనలు చెబుతున్నారు. ఇప్పటికైనా భూతాపానికి కారణమయ్యే ఉద్గారాలకు అడ్డుకట్ట వేయాలని సైంటిస్టులు తెలిపారు.