Home తాజా వార్తలు కొండెక్కిన కోడి ధర

కొండెక్కిన కోడి ధర

Chickenకాసిపేట (మంచిర్యాల) : ఎండలు మండి పోతున్నాయి, అలాగే చికెన్ ధరలు కూడా అలాగే మండిపోతున్నాయి. మొన్నటి వరకు కిలో చికెన్ ధర కిలో160 రుపాయలు పలకగా నేడు కిలో చికెన్ ధర 220 రుపాయలకు చేరింది. సోమగూడెంలోని చికెన్ దుకాణాలలో కిలో కోడిని 150 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. అలాగే చికెన్ ధర 220 రుపాయలుగా అమ్ముతున్నారు. వేసవిలో కోళ్ల దిగుబడి తక్కువగా వుండడం వల్లే చికెన్ ధరలు పెంచినట్లు చికెన్ వ్యాపారులు చెబుతున్నారు. మరో వైపు ప్రస్తుతం కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తుంటే, సామాన్యులు ఏమి తినలేకపోతున్నామని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రగాయలతో పాటు నేడు చికెన్ ధర కూడా చుక్కలు చూపెడుతుందని, దీంతో  పచ్చడి మెతుకులే గతయ్యాయని పేదలు వాపోతున్నారు.

Increased Chicken Prices