Home తాజా వార్తలు నోట్ల రద్దుతో వసూలు పెరిగాయ్

నోట్ల రద్దుతో వసూలు పెరిగాయ్

Increased Collection With Cancellation Of Banknotes

 

ఇప్పటివరకు రూ.6.63లక్షల కోట్లను సమీకరించిన ఐటి
టార్గెట్‌లో సగం ప్రత్యక్ష పన్ను వసూళ్లు వచ్చేశాయ్..
ప్రభుత్వం లక్షం రూ.11.5లక్షల కోట్లు
సిబిడిటి నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : ఏది ఏమైనప్పటికీ డీమానిటైజేషన్ (నోట్ల రద్దు) వల్ల ప్రభుత్వ ఖాజానా నిండుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రత్యక్ష పన్ను వసూళ్లలో సగం వరకు ఇప్పటికే ప్రభుత్వ ఖజనాలోకి వచ్చాయని సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) నివేదిక తెలిపింది. దాదాపు రూ.6.63 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులను ఆదాయం పన్ను శాఖ సమీకరించిందని, ఇది ఏడేళ్లలో రికార్డు స్థాయి వృద్ధి అని పేర్కొంది. ఇప్పటి వరకు(నవంబర్ 15 వరకు) ఆదాయం పన్ను శాఖ స్థూల వసూళ్లు(ప్రత్యక్ష పన్నులు) రూ.6.63 లక్షల కోట్లు వచ్చాయి.

గతేడాది ఇదే సమయంలో స్థూల వసూళ్ల కంటే 16.4 శాతం అధికంగా నమోదయ్యాయి. నోట్ల రద్దు వల్ల సానుకూల ప్రభావం ఏర్పడిందని నివేదిక పేర్కొంది. డీమానిటైజేషన్ వల్ల పన్ను వసూళ్ల పరిధి పెరిగిందని నివేదిక వివరించింది. 2016లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు చేయడం వల్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు, పరిశోధనలకు సంబంధించి సమాచారం లభించగా, పన్ను ఎగవేతదారులపై పన్ను శాఖ విజయం సాధించింది. 201819 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యక్ష పన్ను ఆదాయం వసూళ్ల లక్షం రూ.11.5 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది.

వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. అంటే ఇంకా నాలుగు నెలల్లో ఈ పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. 201314 ఆర్థిక సంవత్సరంలో 3.79 కోట్ల ఆదాయం పన్ను రిటర్న్‌ల(ఐటిఆర్)లతో పోలిస్తే గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 201718లో 6.87 కోట్ల ఐటిఆర్‌లు దాఖలు అయ్యాయి.. అంటే 81 శాతం పెరిగాయి. ఐటి శాఖ పన్ను పరిధి విస్తృతం చేయడమే కాదు, ఐటిఆర్‌ల సంఖ్యను పెంచడంలో వృద్ధిని సాధించింది.

201617 ఆర్థిక సంవత్సరంలో 85.51 లక్షల కొత్త ఐటిఆర్‌లతో పోలిస్తే 201718లో ఈ సంఖ్య 1.07 కోట్లతో 25 శాతం పెరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 201617లో రూ.10.03 లక్షల కోట్లతో పోలిస్తే 201718లో 18 శాతం సాధించాయి. నోట్ల రద్దు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు(నోటీసులు, దాడులు, సర్వేలు) గురించి నివేదికలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డీమానిటైజేషన్ తర్వాత భారీ మొత్తంలో డిపాజిట్ చేసిన బ్యాంక్ ఖాతాదారులకు 3 లక్షల నోటీసులు చేశామని, అయితే ఆదాయం రిటర్న్ దాఖలు చేయలేదని నివేదిక వివరించింది.

Increased Collection With Cancellation Of Banknotes

Telangana Latest News