Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పెరిగిన వంటగ్యాస్ ధర…

 Increased cooking gas price

డిల్లీ: వంటగ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. ఎల్‌పజీ డీలర్లకు ఇచ్చే కమిషన్‌ను ప్రభుత్వం పెంచడంతో వంటగ్యాస్ ధర ను సిలిండర్‌కు రూ. 2.08 చొప్పున పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ ఇంధన సరఫరాదారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌ను రాయితీపై రూ. 505.34 చొప్పున సరఫరా చేస్తున్నారు. తాజా పెంపుతో ఇది రూ. 507.42కు చేరింది. ఈ నెలలో వంటగ్యాస్‌ ధర పెరగడం ఇది రెండో సారి. నవంబరు 1వ తేదీనే రాయితీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ. 2.94 పెంచుతున్నట్లు ఇంధన సరఫరాదారులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రతినెలా వంటగ్యాస్‌ ధర పెరుగుతూ వస్తోంది. ఈ ఆరు నెలల్లో రూ. 16.21 మేర ధర పెరిగింది.

 Increased cooking gas price

Telangana News

Comments

comments