Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ కిట్ హిట్

Increased delvarice in government hospital

ప్రజారోగ్యంలో తెలంగాణ అత్యుత్తమం

11వ కామన్ రివ్యూ మిషన్ నివేదిక నిర్ధారణ
తగ్గిన మాతా శిశు మరణాలు
ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన కాన్పులు
ఘనంగా ఉపయోగపడుతున్న కెసిఆర్ కిట్‌లు

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజారోగ్యంలో ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ముందు వరుసలో ఉందని, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాన్ని అమలుచేయడంలో మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా సొంతంగా ప్రవేశపెట్టిన పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని పదకొండవ కామన్ రివ్యూ మిషన్ నివేదిక స్పష్టం చేసిం ది. ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, ఎస్‌సి ఎస్‌టిలకు చెందిన రోగులకు ‘జనని సుర క్షా యోజన’ పథకానికి రూపొందించిన మార్గదర్శకాల ను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగా ణ ముందంజలో ఉందని పేర్కొంది. కేంద్రంలోని జనని సురక్షా యోజన తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ‘కెసిఆర్ కిట్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం కింద రూ. 2 వేల విలువైన వస్తువులను కిట్ రూపంలో అందజేయడంతో పాటు ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12 వేల చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకం ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తోందని ప్రశంసించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసూతి జరగడానికి కెసిఆర్ కిట్ చాలా దోహదం చేసిందని కీర్తించింది. ‘అమ్మ ఒడి’, బైక్ అంబులెన్స్‌లు, ‘పరమపద వాహనాల’ సేవలు కూడా 24 గంటలూ అందుబాటులో ఉండడం రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థలో మంచి పరిణామమని పేర్కొనింది. జిల్లా ప్రధానాసుపత్రులను అభివృద్ధి చేయడంతో ఇన్‌పేషెంట్లతో పాటు ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొనింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖతో పాటు వైద్య రంగంలో ఉన్నత విద్యా సంస్థలు,స్వచ్ఛంద సంస్థలతో కలిపి దేశంలోని పదహారు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో గతేడాది నవంబరులో జరిపిన అధ్యయనం వివరాలను ఇటీవల కేంద్ర మంత్రిత్వశాఖ విడుదల చేసింది. దక్షిణాది నుంచి కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్‌లోని పదకొండు అంశాల్లో తెలంగాణలో అమలవుతున్న తీరుపై జరిపిన ఈ అధ్యయనంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు, కెసిఆర్ కిట్, జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణ, మాతా శిశు మరణాల రేటు నియంత్రణలో పురోగతి, ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసూతి కేసులు.. .ఇలా పలు అంశా ల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న ఫలితాలను కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రశంసించింది. అధ్యయనం నవంబరులో జరిగినప్పటికీ ప్రయోగాత్మకంగాఅప్పటికే హైదరాబాద్‌లో అమలవుతున్న ఉచిత వైద్య పరీక్షలు (తెలంగాణ డయాగ్నొస్టిక్స్) చేసే నిర్ణయాన్ని ప్రశంసించింది. మాతా శిశు మరణాల రేటులో జాతీయ సగటుకంటే తెలంగాణలో మెరుగైన ఫలితాలు ఉన్నాయని, ప్రతీ లక్ష కాన్పుల్లో కేవ లం 92 మాత్రమే మాతా మరణాలుగా నమోదైందని, శిశు మరణాలు కేవలం 21 మాత్రమేనని,ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు 91.5% మేర జరుగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొనింది. అయితే రాష్ట్రాల నుంచి ఇటీవల తెప్పించుకున్న వివరాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల పురోగతిని నివేదిక రూపంలో ఇటీవల విడుదల చేసిన కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తెలంగాణలో మాతా మరణాలు 81కి తగ్గినట్లు పేర్కొనింది.మొత్తం కాన్పుల్లో 91.5% ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నందున అప్పుడే పుట్టిన శిశువులకు 68% మేర వ్యాక్సీ న్లు అందుతున్నాయని పేర్కొనింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని, అయితే మరింతగా మెరుగుపడాల్సినఅవసరం ఉందని అభిప్రాయపడింది. ఖమ్మం జిల్లాలోని ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గతేడాది జనవరి నుంచి అక్టోబరు వరకు వచ్చిన అన్ని కేసులను పరిశీలించిన తర్వాత122 కేసులను జిల్లా ప్రధానాసుపత్రికి తరలించినట్లు వెల్లడైందని, ఇందు లో గణనీయంగా సర్జరీ కేసులు, అనీమియా కేసులు ఉన్నట్లు పేర్కొనింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లలో బ్లడ్ బ్యాంకులు లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని, అదే విధంగా తగినసంఖ్యలో సర్జన్లు లేని కారణంగా సిజేరియన్ అవసరాల కోసం జిల్లా ఆసుపత్రికి పంపించాల్సి వచ్చి ందని వివరించింది.ప్రసూతి అయిన వెంటనే శిశువులకు మొదటి గంటలోనే తల్లిపాలు ఇచ్చేందుకు వీలుగా ఖమ్మం ప్రధానాసుపత్రి, ఆదిలాబాద్ ‘రిమ్స్’లలో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని వ్యా ఖ్యానించింది.ఖమ్మం ప్రధానాసుపత్రికి వస్తున్న ప్రసూతి కేసుల్లో ఎక్కువగా అక్కడే కాన్పులు జరిగినవి ఉన్నాయని, చాలా స్వల్ప సంఖ్యలో మాత్రమే ఇతరచోట్ల కాన్పులు జరిగి శిశువుల అవసరాల నిమిత్తం ఆసుపత్రికి వస్తు న్న కేసులు కనిపించినట్లు పేర్కొనింది.
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వైద్యారోగ్య శాఖలో సిబ్బంది విభజనలో జరిగిన జాప్యం,ఆటంకాలతో పాటు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి 21 కొత్త జిల్లాలను ఏర్పా టు చేసినప్పటికీ ఇంత మంచి ఫలితాలు రావ డం ఆహ్వానించదగినదని పేర్కొనింది. రాష్ట్రం మొత్తంమీద మురికివాడలు, వ్యాధులకు ఆస్కా రం ఉన్న ప్రాంతాల‘మ్యాపింగ్’61%మేర పూర్తయిందని, ఇందుకు పట్ట ణ ప్రాంతాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సాంకేతిక సహకారం ఉపయోగపడిందని, గ్రామీణ ప్రాంతా ల్లో ‘మెప్మా’ సహకారం అందించిందని ఆ నివేదిక పేర్కొనింది. అయితే కొన్ని సవాళ్ళను కూడా ప్రస్తావించిన ఈ నివేదిక వీటిపై దృష్టి సారించి మెరుగుపర్చాలని సూచించింది.క మూ ్యనిటీ హెల్త్ సెంటర్‌లలో బ్లడ్ బ్యాంకుల ఏర్పా టు, స్పెషలిస్టు డాక్టర్ల చేత వైద్య సేవలు, బ యో వ్యర్థాల నిర్వహణలో మెరుగుదల,రోగుల కేస్ షీట్‌లలో వారి ఫోటోలను ఉంచడం..ఇలా పలు చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచించింది.

Comments

comments